AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విధి ఎంత విచిత్రమైనది..! ఒకేసారి పుట్టారు.. ఒకే చితిపై బూడిదయ్యారు.. కదిలించిన కవలల మరణం!

ఒకేసారి జన్మించారు.. విధి ఆడిన వింత నాటకంలో ఒకేసారి మరణించారు.. చివరకు వారి అంత్యక్రియలు కూడా ఒకే చితిపై జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో జరిగిన ఈ అత్యంత విషాదకరమైన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కళ్ల ముందే ఇద్దరు కొడుకులు అనంత వాయువుల్లో కలిసిపోవడంతో ఆ తల్లిదండ్రుల ఆక్రందనలు చూసి శ్మశానవాటికలోని ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరిగాయి.

విధి ఎంత విచిత్రమైనది..! ఒకేసారి పుట్టారు.. ఒకే చితిపై బూడిదయ్యారు.. కదిలించిన కవలల మరణం!
Twin Brothers Drowned In Pond
Balaraju Goud
|

Updated on: Jun 10, 2026 | 3:29 PM

Share

ఒకేసారి జన్మించారు.. విధి ఆడిన వింత నాటకంలో ఒకేసారి మరణించారు.. చివరకు వారి అంత్యక్రియలు కూడా ఒకే చితిపై జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో జరిగిన ఈ అత్యంత విషాదకరమైన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కళ్ల ముందే ఇద్దరు కొడుకులు అనంత వాయువుల్లో కలిసిపోవడంతో ఆ తల్లిదండ్రుల ఆక్రందనలు చూసి శ్మశానవాటికలోని ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరిగాయి.

ఘాజీపూర్‌లోని దేవకాలి బ్లాక్ ముదర్భా గ్రామానికి చెందిన బధేలాల్ యాదవ్ కుమారులు హిమాంశు, ప్రియాంశు యాదవ్ (16) కవల సోదరులు. సోమవారం వీరిద్దరూ తమ గేదెలను కాసేందుకు, వాటికి స్నానం చేయించడానికి గ్రామ చెరువు వద్దకు వెళ్లారు. గేదెలను కడిగిన అనంతరం, ఆ సోదరులు కూడా స్నానం చేయడానికి చెరువులోకి దిగారు. అయితే, అక్కడ నీరు లోతుగా ఉందనే విషయాన్ని గమనించని కవలలు.. లోపలికి వెళ్లి నీటిలో మునిగిపోయారు. చాలా సేపటి వరకు పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లి గాలించారు. గంటల తరబడి శ్రమించి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఒకే చితిపై అంతిమ సంస్కారాలు

మంగళవారం (జూన్ 09) పోస్ట్‌మార్టం అనంతరం చౌచక్‌పూర్ గంగా ఘాట్‌లో వీరి అంత్యక్రియలు నిర్వహించారు. కలిసి పుట్టిన ఆ ఇద్దరు అన్నదమ్ముల అంతిమ యాత్ర కలిసే సాగింది. చివరకు తండ్రి బధేలాల్ యాదవ్ ఒకే చితిపై ఇద్దరు కుమారుల శవాలను ఉంచి అంతిమ సంస్కారం చేశారు. తల్లి పర్మితా దేవి, అక్క కరిష్మా దుఃఖం చూసి గ్రామం మొత్తం కన్నీరు పెట్టింది. విధి ఆడిన ఈ క్రూరమైన ఆటకు ఒకేసారి రెండు ప్రాణాలు బలికావడంతో ముదర్భా గ్రామం కోలుకోలేని శోకసంద్రంలో మునిగిపోయింది.

ఈ ఘోర ప్రమాదంపై జిల్లా మేజిస్ట్రేట్ అనుపమ్ శుక్లా తీవ్రంగా స్పందించారు. సుమోటాగా కేసును స్వీకరించారు. సదరు చెరువు వద్ద పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరిగిందని, మైనింగ్ మాఫియా తవ్వకాల వల్ల చెరువులో ప్రమాదకరమైన లోతైన గుంతలు ఏర్పడ్డాయని ప్రాథమికంగా గుర్తించారు. ఆ గుంతలను గమనించకపోవడం వల్లే పిల్లలు మునిగిపోయారని నిర్ధారించారు. ఈ దారుణానికి కారణమైన మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డీఎం ఆదేశించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us