TTD closing Dates: శ్రీవారి భక్తులకు గమనిక! ఆ రెండు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేత..

తిరుమలలో శ్రీ వారికి జరిగే నిత్య సేవలకు రెండు రోజులు అంతరాయం కలగనుంది. సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని రెండు రెండు రోజుల పాటు మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం (అక్టోబర్‌ 11)..

TTD closing Dates: శ్రీవారి భక్తులకు గమనిక! ఆ రెండు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేత..
Tirumala Srivari Temple
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 11, 2022 | 9:32 PM

తిరుమలలో శ్రీ వారికి జరిగే నిత్య సేవలకు రెండు రోజులు అంతరాయం కలగనుంది. సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని రెండు రెండు రోజుల పాటు మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం (అక్టోబర్‌ 11) ప్రకటించింది. అక్టోబర్‌ 25న సూర్యగ్రహణం, నవంబర్‌ 8న చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. గ్రహణం ఏర్పడే రోజుల్లో 12 గంటల పాటు స్వామివారి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు ఈ సందర్భంగా తితిదే స్పష్టం చేసింది. ఈ నెల 25న ఏర్పడే సూర్యగ్రహణం ఉదయం 8 గంటల11 నిముషాల నుంచి రాత్రి 7 గంటల 30 నిముషాల వరకు ఉంటుంది. అలాగే నవంబర్‌ 8న ఏర్పడే చంద్రగ్రహణం ఉదయం 8 గంటల 40 నిముషాల నుంచి రాత్రి 7 గంటల 20 నిముషాల వరకు ఉంటుంది. ఈ రెండు రోజుల్లో ఆయా సమయాల్లో ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ నిర్వహకులు పేర్కొన్నారు. గ్రహణాలు ఏర్పడే రోజుల్లో బ్రేక్‌, ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు, అన్నప్రసాద పంపిణీ సైతం రద్దు చేయనున్నట్లు పేర్కొంది. సర్వదర్శనం భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు తితిదే వెల్లడించింది.