AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ దూకుడు.. మూడు రోజుల కస్టడీకి అభిషేక్ రావు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్‌రావుది కీలక పాత్రగా సీబీఐ గుర్తించింది. మరికొందరి పాత్రపై నిగ్గుతేల్చాల్సి ఉందని తెలిపింది.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ దూకుడు.. మూడు రోజుల కస్టడీకి అభిషేక్ రావు
Delhi Liquor Scam
Basha Shek
|

Updated on: Oct 11, 2022 | 9:47 PM

Share

సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ కేసులో సీబీఐ, ఈడీ దూకుడు పెంచాయి. అరెస్ట్‌లు, దాడులతో స్కామ్‌లో హస్తం ఉన్నవారి గుండెల్లో సీబీఐ రైళ్లు పరుగెట్టిస్తుంది. ఇప్పటికే విజయ్‌నాయర్‌, సమీర్‌ మహేంద్రును అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. మొన్న ఢిల్లీలో అభిష్‌క్‌రావును సీబీఐ విచారించింది. నిన్న అరెస్టు చేసి ప్రత్యేక కోర్టు జడ్జి ముందు హాజరుపరిచింది. కీలక విషయాలు రాబట్టాలని.. అందుకోసం 5 రోజులు కస్డడీకి ఇవ్వాలని కోరింది. దీంతో 3 రోజుల కస్టడీకి సీబీఐ కోర్టు అనుమతించింది. అభిషేక్‌ను రెండవ రోజు విచారించిన అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అభిషేక్‌రావుకు సంబంధించిన కీలక విషయాలు సీబీఐ కస్టడీ రిపోర్టులో వెల్లడించాయి. అభిషేక్‌రావును 8సార్లు పిలిచి ప్రశ్నించిన సీబీఐ.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో ఆయనకు లింకులు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్‌రావుది కీలకపాత్రని తేల్చింది. నేషనల్‌ మీడియా సెంటర్‌ యజమాని.. అర్జున్‌పాండేను నిందితుడిగా నిర్ధారించిన సీబీఐ.. విజయ్‌నాయర్ స్టేట్‌మెంట్ ఆధారంగా అభిషేక్ అరెస్ట్ చేసింది. లిక్కర్‌ స్కామ్‌లో అభిషేక్‌రావుది కీలక పాత్రని తేల్చిచెప్పింది. సౌత్‌లాబీ పేరుతో.. ఇండో స్పిరిట్‌ యజమాని విజయ్‌నాయర్‌, దినేష్‌ అరోరాతో కలిసి అభిషేక్‌రావు కుట్ర చేసినట్లు సీబీఐ అధికారుల విచారణలో తేలింది. దీనికి సంబంధించి 2021 నవంబర్‌ నుంచి 2022 జులై వరకు.. పలు దఫాలుగా వీరు సమావేశమైనట్టు గుర్తించారు. రూ.3.80 కోట్లను అభిషేక్‌రావు 3 అకౌంట్ల ద్వారా.. షమీర్‌ మహేంద్రకు హవాలా రూపంలో ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు గుర్తించారు. వీరికి ఢిల్లీ పెద్దలు డబ్బులు పంపాలన్న ఒత్తిళ్లు వచ్చినట్లు సీబీఐ రిపోర్ట్ లో తేలింది. మరికొందరి పాత్రపై నిగ్గుతేల్చాల్సి ఉందని రిపోర్ట్ లో సీబీఐ తెలిపింది.

ఇక అభిషేక్ రావు అనుమానాస్పద లావాదేవీలు, సమీర్‌, విజయ్‌నాయర్‌తో సంబంధాలపై సుదీర్ఘంగా సీబీఐ ఆరాతీస్తోంది. విమాన టికెట్లు, హోటల్స్‌ బుకింగ్లకు సంబంధించిన ఆధారాలు అభిషేక్ రావు ముందు ఉంచి ఎంక్వైరీ చేస్తుంది. రేపు మూడోరోజు అభిషేక్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలు రాబట్టాక మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం లేకపోదంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే