AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: రాత్రి వేళల్లో బిర్యానీ తింటున్నారా.. ఇక మీ పని అయిపోయినట్లే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినన్ని పోషక పదార్థాలు అవసరం. విటమిన్లు, ఖనిజాలతో పాటు శరీరానికి ఉపయోగపడే ప్రొటీన్లను తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారం ద్వారా వీటిని పొందవచ్చు. ఇవి మనల్ని ఆరోగ్యంగా..

Health: రాత్రి వేళల్లో బిర్యానీ తింటున్నారా.. ఇక మీ పని అయిపోయినట్లే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Biryani
Ganesh Mudavath
|

Updated on: Nov 12, 2022 | 9:59 AM

Share

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినన్ని పోషక పదార్థాలు అవసరం. విటమిన్లు, ఖనిజాలతో పాటు శరీరానికి ఉపయోగపడే ప్రొటీన్లను తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారం ద్వారా వీటిని పొందవచ్చు. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రోగాల బారి నుంచి కాపాడతాయి. సాధారణంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం చేస్తుంటారు. అయితే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కొన్ని రాత్రిపూట తినడానికి అంతగా సురక్షితం కావు. మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనే విషయం మనకు తెలిసిందే. అందుకే ఫుడ్ డైట్ లో చాలా అలర్ట్ గా ఉండాలి. లేకపోతే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పోషకాహారంతోనే మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి కొన్ని రకాల ఆహార పదార్థాలకు రాత్రి పూట దూరంగా ఉండాలి. ఆయుర్వేదం కూడా ఇదే విషయాన్ని వివరిస్తోంది. రాత్రి పూట తీసుకునే కొన్ని పదార్థాలు జీర్ణ క్రియకు ఇబ్బంది కలిగిస్తాయని, కాబట్టి వాటికి దూరంగా ఉండాలని చెబుతోంది.

సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో సామాన్యులకు కూడా అందుబాటు ధరలో లభించే పండు ఏదైనా ఉందంటే.. అది ఒక్క అరటిపండు మాత్రమే. అరటి పండు తింటే తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. ఆపిల్‌లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ పండును పాలతో కలిపి తీసుకోకూడదు. వరి అన్నం రాత్రి పూట తినకూడదు. మధ్యాహ్నం మాత్రమే తినాలి. రాత్రి వేళ వరి అన్నానికి బదులుగా గోధుమ పిండితో చేసిన రొట్టెలు తినడం మేలు. పాలు జీర్ణమయ్యేందుకు ఎక్కువ టైం అవసరం. అందుకని రాత్రి వేళ తీసుకోవడం ఉత్తమం. పెరుగును కేవలం పగటి వేళనే తినాలి.రాత్రి సమయంలో పెరుగు త్వరగా జీర్ణం కాదు. మాంసం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకని మధ్యాహ్నమే తినాలి.

మసాలా పదార్థాలకు రాత్రి పూట ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా బిర్యానీని రాత్రి వేళల్లో తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. సాయంత్రం ఏడు గంటల తర్వాత చికెన్ ,మటన్ బిర్యానీలను అస్సలు తినకూడదు. ఇది ఆరోగ్యాన్ని మరింత పాడు చేస్తాయి. ఇక వీటిలో కొవ్వు క్యాలరీలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి . కాబట్టి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. రాత్రి 7 గంటల తర్వాత స్వీట్లు కూడా తినకూడదు. వేయించిన పదార్థాలు, టీ, కాఫీ వంటి పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..