AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Health: పెరుగుతున్న గుండె జబ్బుల ముప్పు.. వాటిలో మార్పులు చేసుకోకుంటే పెను సమస్యలు తప్పవు..

పెరుగుతున్న వయస్సు, జీవనశైలి కారణంగా అనేక వ్యాధుల ముప్పు ముంచుకొస్తోంది. పలు సందర్భాల్లో జన్యు పరమైన వ్యాధులు కూడా చుట్టుముడుతున్నాయి. గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా జన్యువుల వల్ల వస్తాయని..

Heart Health: పెరుగుతున్న గుండె జబ్బుల ముప్పు.. వాటిలో మార్పులు చేసుకోకుంటే పెను సమస్యలు తప్పవు..
Heart Attack
Ganesh Mudavath
|

Updated on: Oct 11, 2022 | 7:29 AM

Share

పెరుగుతున్న వయస్సు, జీవనశైలి కారణంగా అనేక వ్యాధుల ముప్పు ముంచుకొస్తోంది. పలు సందర్భాల్లో జన్యు పరమైన వ్యాధులు కూడా చుట్టుముడుతున్నాయి. గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా జన్యువుల వల్ల వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తీవ్రమైన వ్యాధులు రావడానికి జీవనశైలిలో వచ్చిన మార్పులే కారణమని తెలుస్తోంది. అంతే కాకుండా తినే విషయంలో, జీవించే విధానంలోనూ వస్తున్న మార్పులు వ్యాధులను ప్రోత్సహిస్తోంది. సెంటర్ ఫర్ కంప్యూటేషన్ బయాలజీ జరిపిన పరిశోధనలో 50 ఏళ్ల తర్వాత వచ్చే వ్యాధుల్లో చాలా వరకు జీవనశైలి కారణంగానే వస్తున్నాయని వెల్లడైంది. నిర్ణీత వయుసు వచ్చిన తరువాత జన్యు పరంగా వచ్చే వ్యాధుల ముప్పు క్రమంగా తగ్గుతుంది. కానీ ఆహారంలో తీసుకునే నిర్ణయాల కారణంగా వ్యాధి ముప్పు మరంత పొంచి ఉండే అవకాశం ఉంది. ఈ విషయంపై శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో వెయ్యి మంది పాల్గొన్నారు. ఇందులో వయసు పెరిగే కొద్దీ జన్యువుల వల్ల వచ్చే వ్యాధులు చాలా తక్కువ అని తేలింది. కానీ చెడు జీవనశైలి ఉన్న వ్యక్తులు అనేక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని గుర్తించారు.

ప్రస్తు్త రోజుల్లో చిన్న వయస్సులోనే గుండెపోటు వస్తోంది. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లలో ఛేంజెస్ కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. ఆహారంలోని అధిక కొవ్వు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాకుండా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతాయి. వయస్సుతో పాటు టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. మధుమేహం అనేక సందర్భాల్లో జన్యుపరంగా కూడా వస్తుంది. అయితే చెడు ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ మార్పుల కారణంగా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అంతే కాకుండా ఇప్పుడు 50 ఏళ్ల వయస్సు తర్వాత అల్జీమర్స్, ఇతర న్యూరోలాజికల్ డిజార్డర్స్ వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువ అని పరిశోధనల్లో తేలింది. అయితే.. వ్యాధుల బారిన పడుకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రపోయే సమయంలో మార్పులు చేసుకోవాలి. రోజూ ఒకే సమయంలో నిద్ర పోయే విధంగా వేళలను సెట్ చేసుకోవాలి. వేపుళ్లు, అధిక నూనెతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రోటీన్, విటమిన్లు ఉండే ఆహాహాన్ని తీసుకోవాలి. రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి. ఉదయం లేచి మెడిటేషన్ చేయాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. ఇలా చేస్తే వ్యాధుల ముప్పు తగ్గుతుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం