AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pistachios: పిస్తాపప్పులను ఎక్కువగా తింటే కలిగే ఆరోగ్య సమస్యలివే.. ముఖ్యంగా మీ గుండెకు హానికరం.. ఎందుకంటే..?

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి పండ్లు, విత్తనాలు, కూరగాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి పోషక విలువలతో కూడి ఉండడమే అందుకు కారణం. అయితే వీటిని పరిమితంగా..

Pistachios: పిస్తాపప్పులను ఎక్కువగా తింటే కలిగే ఆరోగ్య సమస్యలివే.. ముఖ్యంగా మీ గుండెకు హానికరం.. ఎందుకంటే..?
Pistachios Side Effects
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 24, 2023 | 8:58 PM

Share

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.  ఈక్రమంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి పండ్లు, విత్తనాలు, కూరగాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి పోషక విలువలతో కూడి ఉండడమే అందుకు కారణం. అయితే వీటిని పరిమితంగా తీసుకున్నప్పుడే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ మితిమీరిన పరిమాణంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు కూడా కారణం కాగలవు. ఇక ఎన్నో రకాల పోషక విలువలున్న గింజలలో పిస్తా పప్పులు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉపకరిస్తాయి. పిస్తాపప్పులు బట్టరీ ఫ్లేవర్‌ను కలిగి ఉండడం వల్ల వీటిని తినేందుకు మనం ఎంతగానో ఇష్టపడుతుంటాం. చాక్లెట్లు, ఐస్ క్రీం, క్యాండీ, డెజర్ట్‌‌స్ తదితర ఆహారపదార్థాలలో విరివిగా ఉపయోగించే పిస్తాపప్పులలో.. అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్, ఫైబర్, కాపర్,  ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇలా పోషక విలువలను పుష్కలంగా కలిగి ఉండే పిస్తాపప్పులు బరువు తగ్గడానికి, గుండె, ప్రేగుల పనితీరును మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి. అయితే పిస్తాపప్పులను మరీ ఎక్కువగా తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రక్తంపై అధిక ప్రభావం పడి శరీరంలో అనేక సమస్యలకు దారితీస్తుంది. పిస్తా పప్పులను అధికంగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పిస్తాపప్పును అధికమోతాదులో తింటే కలిగే ఆరోగ్య సమస్యలివే..

  1. అధిక రక్తపోటు: పిస్తాపప్పులు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. అదనంగా తలనొప్పి, అస్పష్టమైన దృష్టి, గందరగోళం, మూర్ఛ వంటి ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇక సాల్టెడ్ పిస్తాపప్పులు తీసుకోవడం వల్ల కూడా రక్తంలో సోడియం స్థాయి పెరుగుతుంది. ఫలితంగా హైపర్‌టెన్షన్‌తో సహా వివిధ హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది
  2. బరువు పెరగడం: పిస్తాపప్పులను చాలా సులభంగా తినగలిగే గింజలుగా చాలా మంది అనుకుంటారు. వీటిని తినడం వల్ల శరీరానికి పోషకాలు అందడమే కానీ ఎలాంటి దుష్రభావాలు ఉండబోవని భావిస్తుంటారు. అయితే రోజువారీ పిస్తాపప్పులను తినడం వల్ల కూడా బరువు పెరిగే ప్రమాదం ఉంది. వీటిలోని పోషకాలు కొంత కాలం తర్వాత శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపించే అవకాశం ఉంది. తద్వారా బరువు పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
  3. కిడ్నీ స్టోన్స్: ఎక్కువగా పిస్తాపప్పులను తినడం వల్ల ఇందులో ఉండే ఆక్సలేట్స్, మెథియోనిన్  విడుదల పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో పొటాషియం అక్సలేట్లు,  కాల్షియం అక్సలేట్లుగా ఏర్పడతాయి. అదే సమయంలో అవి మెథియోనిన్ సిస్టీన్‌గా మారవచ్చు. సిస్టీన్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే కారకాలలో ఒకటి.
  4. అలెర్జీ: ట్రీ నట్ ఎలర్జీ ఉన్నవారు పిస్తా తినడం మానుకోవాలి. ట్రీ నట్స్ అలెర్జీ వల్ల వాంతులు, మింగడంలో ఇబ్బంది, నోటిలో దురద, నాసికా రద్దీ, తిమ్మిర్లు మరియు వికారం, వంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది.

అందువల్ల పిస్తాపప్పులను తినేవారు తగినంత మొత్తంలోనే తినాలి. మితిమీరిన పరిమాణంలో తీసుకుంటే అమృతం కూడా విషం కాగలదు కాబట్టి ఆహారం విషయంలో తగు జాగ్రత్తలను పాటించడం తప్పనిసరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..