AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అద్దంలో తన అందం చూసుకుని తెగ మురిసిపోయిన బుజ్జి కుక్క.. ఎంత క్యూట్‌గా ఉందో.. మీరే చూడండి..

తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక పెంపుడు కుక్కపిల్ల బంతితో ఆడుకుంటూ అనుకోకుండా అద్దం దగ్గరకు వచ్చింది. అంతే తన అందాన్ని చూసుకుని సంతోషమేసిందో ఏమో కానీ ఆ అద్దం ముందే పడుకుని మురిసిపోయింది. ఇక దీనికి సంబంధించిన వీడియోను చూసిన..

Watch Video: అద్దంలో తన అందం చూసుకుని తెగ మురిసిపోయిన బుజ్జి కుక్క.. ఎంత క్యూట్‌గా ఉందో.. మీరే చూడండి..
Dog Watching Itself In Mirror
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 24, 2023 | 7:07 PM

Share

మనందరం కూడా అద్దంలో చూసి మురిపోతుంటాం. ఇది సర్వసాధారణంగా అందరూ చేసేపనే. అయితే అందం అనేది మనుషులకు మాత్రమే ఉంటుందా..? అందాన్ని చూసి మనుషులు మాత్రమే మురిసిపోతారా..? అంటే ముమ్మాటికి కాదు. జంతువులు కూడా అలా చేస్తుంటాయి. కోతులు ప్యాంట్, షర్ట్ వేసుకుని టిప్‌టాప్‌గా రెడీ అయి ఫోటోషూట్‌కి పోజులిచ్చిన అనేక వీడియోలను మీరు ఇదివరకే చూసి ఉంటారు. అయితే తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక పెంపుడు కుక్కపిల్ల బంతితో ఆడుకుంటూ అనుకోకుండా అద్దం దగ్గరకు వచ్చింది. అంతే తన అందాన్ని చూసుకుని సంతోషమేసిందో ఏమో కానీ ఆ అద్దం ముందే పడుకుని మురిసిపోయింది. ఇక దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లకు ఇది తెగ నచ్చేసింది. దీంతో ఆ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

అయితే dogs_lover0o అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోలో పెంపుడు కుక్క ప్రవర్తనకు సంబంధించిన దృశ్యాలను స్వయంగా చూడవచ్చు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల 41 వేల లైకులు, 35 లక్షల వీక్షణలు వచ్చాయి. అలాగే వీడియోను చూసిన నెటిజన్ల నుంచి స్పందన లభిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు ఎంత ముద్దుగుందోనని కామెంట్ చేస్తున్నారు. అలాగే మరి కొందరు చాలా క్యూట్‌గా ఉంది ఈ కుక్కపిల్ల అని రాసుకొస్తున్నారు. ఇలా వీడియోను చూసిన కొందరు నెటిజన్లు వారి వారికామెంట్లను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by exporl boy (@dogs_lover0o)

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..