Train Mileage: రైలు మైలేజీ ఎంత..? ఒక కిలోమీటరుకు ఏ మాత్రం ఖర్చవుతుంది..? తెలుసుకుందాం రండి..
సామాన్యుడి నుంచి ధనవంతుల వరకూ అన్నివర్గాల వారు కూడా రైలు సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వేస్ రోజురోజుకు తన పరిధిని విస్తరించుకుంటూ వస్తోంది. దూర ప్రయాణం అంటే రైలు ఒక్కటే..
ప్రపంచ రవాణా వ్యవస్థలో భారత్ రైల్వే అత్యంత పెద్దది. సగటున రోజుకు కోట్లాది మంది రైళ్లలోనే తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఆ కారణంగానే రవాణా వ్యవస్థలో ఎన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నా, అత్యాధునికి టెక్నాలజీ అందుబాటులో వచ్చినా రైలుకు ఉన్న ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గలేదు. సామాన్యుడి నుంచి ధనవంతుల వరకూ అన్నివర్గాల వారు కూడా రైలు సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వేస్ రోజురోజుకు తన పరిధిని విస్తరించుకుంటూ వస్తోంది. దూర ప్రయాణం అంటే రైలు ఒక్కటే అందరికీ అందుబాటులో ఉన్న సదుపాయం. సొంత ప్రదేశంలో మనం బైక్, కారు వేసుకుని వెళ్లగలం కానీ దూరాలు వెళ్ళలేం. ఎందుకంటే మన వాహనాలకు మైలేజీ సమస్యలు, లేదా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండడమే ప్రధానకారణం. ఇక రైలు విషయానికి వస్తే దాని మైలేజీ ఎంత అనే ఆలోచన కూడా మనకు కలిగి ఉండదు. టికెట్ కొన్నామా.., ప్రయాణం ముగిసిందా.. అంతేచాలు. కానీ రైలు మైలేజీ ఎంత, ఒక కి.మీ దూరానికి ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా..? చేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చేసి, వాటి వివరాలు తెలుసుకుందాం..
వాహనాల మాదిరిగా రైలు మైలేజీ కూడా చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. దానిని నిర్ధిష్ట మైలేజీ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే రైలు మైలేజీ ప్యాసింజర్ రైలు, ఎక్స్ ప్రెస్ రైలు లేదా కోచ్‌ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ మైలేజీ అనేది కోచ్‌లను బట్టి ఉంటుంది. తక్కువ కోచ్‌లు ఉంటే ఆ ప్రభావం ఇంజన్‌పై కూడా తగ్గుతుంది. దాని శక్తి పెరిగి మైలేజీ కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే రైలు మైలేజీని కిలోమీటర్లు కాకుండా గంటల్లోనే లెక్కించడం దీని స్పెషల్. 24, 25 కోచ్‌లు ఉన్న రైలుకు ఒక కిలోమీటరుకు ఆరు లీటర్ల డీజిల్ ఖర్చవుతుందని ఒక నివేదికలో చెప్పబడింది. ఆశ్చర్యకరంగా ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్ల కంటే ప్యాసింజర్ రైళ్లలోనే మైలేజీ తగ్గుతుందని రైల్వేశాఖ చెబుతోంది.
ఒక ప్యాసింజర్ రైలు ఒక కిలోమీటరు దూరం ప్రయాణించాలంటే 6 లీటర్ల డీజిల్ ఖర్చవుతోంది. అనేక స్టేషన్లలో ఆగడమే ఇందుకు కారణం. అదే సమయంలో 12 కోచ్‌లతో ఉన్న ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైలు కిలోమీటరు ప్రయాణించాలంటే కేవలం 4.5 లీటర్ల డీజిల్ ఉంటే సరిపోతుందట. రైలు మైలేజీ ఇంజన్ శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఇందులో తరచూ బ్రేకింగ్, ఎత్తు ఎక్కడం, ఎక్కువ లోడ్ లాగడం తదితర అంశాలు ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అయితే ప్రపంచ రైల్వే హిస్టరీలో ఇండియన్ రైల్వే ఖ్యాతి పెంచుకోవడంతో పాటు ప్రజాదరణను కూడా పొందుతోంది. అందుకే రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెంచింది. ఆ క్రమంలోనే ఇటీవల ఆత్మగౌరవ్, వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టింది.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..