Summer Health: వేసవిలో మితంగా తీసుకోవలసిన ఆహారాలివే.. పరిమితి దాటితే ఆరోగ్యానికి తప్పవు సమస్యలు..!

వేసవి కాలంలో తీసుకునే పదార్థాలపై ఓ కన్నేసి ఉండడం చాలా మంచిందని నిపుణులు సూచన. లేదంటే కడుపులో మంట‌, ఎసిడిటీ లాంటి సమస్యలు ఎన్నో చుట్టుముట్టే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో నీళ్లు సరిపడినంతగా..

Summer Health: వేసవిలో మితంగా తీసుకోవలసిన ఆహారాలివే.. పరిమితి దాటితే ఆరోగ్యానికి తప్పవు సమస్యలు..!
Summer Health
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 24, 2023 | 4:30 PM

కొన్ని రోజులుగా ఎండలు ముదిరిపోతున్నాయి. వేసవి రాకముందే మండిపోతున్న ఈ ఎండలలో చాలా జగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేదంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఇక ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ సీజ‌న్‌లో ద‌గ్గు, జ‌లుబులు కొందరిని వేధిస్తుంటాయి. ఈ కాలంలో శరీరం వేడిగా కూడా ఉంటుంది. ఈ వేడి కార‌ణంగా మరికొందరిని విరేచనాలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే, ఈ కాలంలో తీసుకునే పదార్థాలపై ఓ కన్నేసి ఉండడం చాలా మంచిందని నిపుణులు సూచన. లేదంటే కడుపులో మంట‌, ఎసిడిటీ లాంటి సమస్యలు ఎన్నో చుట్టుముట్టే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో నీళ్లు సరిపడినంతగా తాగకపోయినా, కొన్ని పదార్థాలను అతిగా తీసుకున్నా ఎన్నో చిక్కుల్లో పడాల్సి ఉంటుందని వారు పదేపదే గుర్తు చేస్తున్నారు. ఆయా పదార్థాలను పరిమితంగా తింటే ఆరోగ్యానికి మంచిదే. అయితే పరిమితికి మించితే.. ముఖ్యంగా వేసవిలో ప్రమాదకరం కాగలవు. మరి వేసవిలో మితంగా తీసుకోవలసిన ఆహారాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మ‌సాలాలు, కారం, నాన్‌వెజ్: ఎండాకాలంలో నాన్‌వెజ్‌కు దూరంగా ఉండాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమ్యలతోపాటు, ఒంట్లో అధిక కొవ్వు కూడా చేరే అవకాశం ఉంది. అలాగే పొట్టలో మంటను కూడా కలిగిస్తాయి. వీటితోపాటు కారం, మసాలాలు ఎక్కువగా తీసుకోకూడదు.

బేక‌రీ, జంక్ ఫుడ్స్‌: జంక్స్ ఫుడ్స్‌తోపాటు, బేకరీ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే దాహం ఎక్కువగా వేస్తుంది. అలాగే ఇవి శ‌రీరంలో నీటి శాతాన్ని విపరీతంగా త‌గ్గిస్తాయి. అందుకే ఈ ఆహారాలను తక్కువగా తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

నూనె పదార్థాలు: వేసవిలో నూనె పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే.. విరేచ‌నాల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నూనె పదార్థాలు దప్పికను పెంచడంతో పాటు డీహైడ్రేష‌న్‌ బారిన పడేలా చేసేందుకు అవకాశంఉంది. అందుకే నూనెతో చేసిన పదార్థాలకు ఈ కాలంలో దూరంగా ఉండాలి.

మామిడి కాయ‌లు: వేసవిలో ఎక్కువగా లభించే మామిడి పండ్లను చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే వీటిని పరిమితంగా తింటే ఎంతో ఉపయోగం ఉంటుంది. అలా కాదని, విపరీతంగా లాగిస్తే మాత్రం, శ‌రీరంలో విపరీతంగా వేడి పెరుగుతుంది. ఫలితంగా విరేచనాలతో ఇబ్బంతి పడే అవకాశం ఉంటుంది. అందుకే ఏ పదార్థమైనా పరిమితంగా తీసుకుంటేనే మంచింది.

మద్యం: ఈ సీజన్‌లో దాహం ఎక్కువగా అవుతుంటుంది. ఇక మ‌ద్యం అతిగా తీసుకుంటే, అధికంగా దప్పిక వేస్తుంది. ఎక్కువగా దాహం వేయడంతో నాలుక పొడిబారుతుంది. అలాగే శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి లివ‌ర్‌ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల వేసవి కాలంలో సాధ్యమైనంతవరకు మద్యానికి దూరంగా ఉండడం మంచిది.

టీ, కాఫీలు: టీ, కాఫీల‌ను ఎక్కువగా తాగడం వల్ల ఒంట్లో వేడి విపరీతంగా పెరుగుతుంది. టీ, కాఫీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్‌, ఎసిడిటీ బారిన పడే అవకాశం ఉంది. అందుకే వీటికి బ‌దులుగా కొబ్బరి నీళ్లు, హెర్బల్ టీ, వాటర్ మిలాన్ జ్యూస్, కర్బూజా జ్యూస్‌, కీర‌దోస కాయలు లాంటివి తీసుకోవడం మంచింది. వీటిని తీసుకుంటే మన శ‌రీరంలో నీటి శాతాన్ని పుష్కలంగా ఉంచేలా చేస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..