Viral Video: అల్లరి చేసిన పిల్ల చింపాంజీ.. బడితపూజ చేసిన తల్లి.. నవ్వులు పూయిస్తోన్న వీడియో

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Mar 24, 2023 | 7:59 PM

ఇంటర్నెట్‌లో షేర్ చేసే వీడియోలు మన మెకానికల్ జీవితంలో మనం ఎదుర్కొనే టెన్షన్‌ల నుంచి కాస్త రిలాక్స్ అవ్వడానికి సహాయపడతాయి. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో చింపాంజీ చేసిన పనులు నెట్టింట నవ్వులు పూయిస్తుంది. 

Viral Video: అల్లరి చేసిన పిల్ల చింపాంజీ.. బడితపూజ చేసిన తల్లి.. నవ్వులు పూయిస్తోన్న వీడియో
Chimpanzee
Follow us

సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతోన్న వీడియోస్ లో జంతువులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియోల్లో కొన్ని భయాన్ని పుట్టిస్తే చాలా వీడియోలు నవ్వులు పూయిస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో  షేర్ చేసే , ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇంటర్నెట్‌లో షేర్ చేసే వీడియోలు మన మెకానికల్ జీవితంలో మనం ఎదుర్కొనే టెన్షన్‌ల నుంచి కాస్త రిలాక్స్ అవ్వడానికి సహాయపడతాయి. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో చింపాంజీ చేసిన పనులు నెట్టింట నవ్వులు పూయిస్తుంది.

చిన్నతనం నుంచే పిల్లలకు మంచి నడవడిక, మంచి విలువలు నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై  ఉంటుంది. తల్లిదండ్రుల మాటలు వినే పిల్లలు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారన్నారు. వినకపోతే కొట్టిమరీ నేర్పిస్తుంటారు తల్లిదండ్రులు.

అనవసరమైన అల్లర్లకు జంతువు తన పిల్లలను కొట్టడం మీరు ఎప్పుడైనా చూశారా.? ఇది విచిత్రంగా ఉంటుంది. అయితే అలాంటి ఘటనే జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక పిల్ల చింపాంజీ జూ సందర్శకులపై రాళ్లు విసరడం చూడవచ్చు. అది తల్లికి అది నచ్చలేదు. అది పెద్ద కర్రను తీసుకుని అల్లరి చింపాంజీని కొట్టింది. మనుషులపై రాళ్లు విసరడం తప్పు అని దాని పిల్లకు ఈ విధంగా చెప్పింది తల్లి చింపాంజీ.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu