AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మరి ఇంత భయమా..? నీటిలోకి దిగేందుకు ఈ చింపాంజీ ఏం చేసిందో మీరే చూడండి..

ప్రస్తుత కాలంలో అందరికీ అందుబాటులో వచ్చిన సోషల్ మీడియాలో అనేక వీడియోలు రోజూ ట్రెండ్ అవుతుంటాయి. వాటిలో జంతువుల వీడియోలు, చిన్న పిల్లల వీడియోలు ప్రధానంగా ఉంటాయి. ఈ ట్రెండింగ్ వీడియోలను చూసిన నెటిజన్లు సరదాగా కాలాన్ని..

Watch Video: మరి ఇంత భయమా..? నీటిలోకి దిగేందుకు ఈ చింపాంజీ ఏం చేసిందో మీరే చూడండి..
Chimpanzee
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 24, 2023 | 5:51 PM

Share

ప్రస్తుత కాలంలో అందరికీ అందుబాటులో వచ్చిన సోషల్ మీడియాలో అనేక వీడియోలు రోజూ ట్రెండ్ అవుతుంటాయి. వాటిలో జంతువుల వీడియోలు, చిన్న పిల్లల వీడియోలు ప్రధానంగా ఉంటాయి. ఈ ట్రెండింగ్ వీడియోలను చూసిన నెటిజన్లు సరదాగా కాలాన్ని గడపడమేకాక దైనందిన జీవితంలోని బాధలను కొద్ది సమయమైన మరిచిపోతుంటారు. అయితే తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. మరీ పగలబడి నవ్వించే సీన్ కాకపోయినా.. ఆ వీడియోలోని దృశ్యాలను మీ మనసుకు నచ్చేవిగా ఉంటాయి. ఆ కారణంగానే ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పాటు నెటిజన్ల ప్రశంసలను పొందుతోంది. అసలు ఆ వీడియో ఏముందంటే..?

safari_wild7 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయిన వీడియోలో ఒక చింపాంజీ ఎంతో జాగ్రత్తగా తన కాళ్లుచేతులను శుభ్రచేసుకుంటుంది. ఈ క్రమంలో అది ఎంత జాగ్రత్త వహించిందంటే.. ఆ నీటిలోకి జారిపడకుండా, కుంట ఒడ్డున ఉన్న ఒక క్లాత్ ముక్కను పట్టుకుని శుభ్రపరుచుకుంది. మొదట కాలితో ఆ వస్త్రాన్ని పట్టుకుని చేతులు కడుగుకుంది. అనంతరం ఒక చేతితో క్లాత్‌ను పట్టుకుని రెండో చేత్తో కాళ్లను కడిగింది. అయితే ఇంతకి ఆ నీటి కుంట లోతు ఎంత ఉందో అని ఆలోచించారా..? ఆ నీటి కుంట గిలకల లోతు కూడా ఉండదు. ఇక లోతే లేని నీటిలో దిగి కాళ్లుచేతులను శుభ్రచేసుకోవడానికి ఎంతో జాగ్రత్త వహించిన ఆ చింపాంజీ వీడియో నెటిజన్లకు తెగ నచ్చేసింది.

ఇవి కూడా చదవండి

చింపాంజీ వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by James A (@safari_wild7)

కాగా, ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 22 వేల మంది లైక్ చేయగా, 44 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే పలువురు నెటిజన్లు వీడియోపై రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు వాటికి అన్నీ తెలుసు, కానీ మాట్లాడవు. మాట్లాడితే మన లాగా మళ్లీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని భయం అంటున్నారు. ఇక మరికొందరైతే అవి చాలా తెలివైనవి. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు ఉంటాయి. ఎందుకంటే వాటికి మనలాగా వండుకోవడం, ఆఫీసుకెళ్లడం ఇష్టం లేదని రాసుకొచ్చారు. ఇలా నెటిజన్లంతా వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి