Hilarious Video: పాపతో చిందేస్తూ భార్యకు దొరికిపోయిన భర్త.. ఆ తర్వాత కొట్టడమే తక్కువ.. అసలు ఏం జరిగిందంటే..?

శివలీల గోపి తుల్వా

శివలీల గోపి తుల్వా |

Updated on: Mar 24, 2023 | 10:00 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిలో జంతువులు, పిల్లలు, ఆర్ట్స్ వీడియోలు ప్రధానంగా ఉండగా.. ఫన్నీ వీడియోలు, భార్యభర్తలకు సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు..

Hilarious Video: పాపతో చిందేస్తూ భార్యకు దొరికిపోయిన భర్త.. ఆ తర్వాత కొట్టడమే తక్కువ.. అసలు ఏం జరిగిందంటే..?
Wife scolding Husband for dancing with another woman
Follow us

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిలో జంతువులు, పిల్లలు, ఆర్ట్స్ వీడియోలు ప్రధానంగా ఉండగా.. ఫన్నీ వీడియోలు, భార్యభర్తలకు సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా నెట్టింట భార్యభర్తలకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసినవారెవరైనా నవ్వాపుకోలేరు. ‘అడవికి రాజైన సింహం కూడా పెళ్లాం ముందు తొక ముడవ్వాల్సిందే’ అనిపించేలా ఉన్న ఆ వీడియోను చూసిన నెటిజన్లు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. అసలు ఆ వీడియోలో అంతలా ఏముందంటే..?

bewarsegang అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి నెట్టింట ప్రత్యక్షమైన ఈ వీడియోలో.. క్లబ్‌లో ఓ వ్యక్తి వేరే మహిళతో డ్యాన్స్ వేస్తుంటాడు. అయితే అంతలోనే వెనుక నుంచి అతని భార్య వచ్చి నిలబడుతుంది. అంతే కాలికి  ఉన్న చెప్పు పట్టుకుని ‘వేయ్ డ్యాన్స్ వేయ్’ అంటూ తలూపింది. ఆ వ్యక్తికి తన భార్య కంటే అధిక బలం, ఎత్తు, లావు ఉన్నా నోరు మెదపకుండా అంతే భయపడుతూ నిలబడిపోయాడు. మళ్లీ ‘వేయ్ ఆమెతో డ్యాన్స్ వేయ్’ అంటూ చెవి పట్టుకుని కూడా లాగుతుంది. అతను మాత్రం మెదలకుండా ఉండిపోతాడు. ఆపై తన భర్తతో డ్యాన్స్ చేసిన మహిళను ముందుకు లాగి డ్యాన్స్ వేయండంటూ సైగ చేస్తుంది. అతను మాత్రం వణికిపోతున్నట్లుగా నిలబడిపోయి ఉంటాడు. చివరికి అతన్ని అక్కడ నుంచి బయటకు తీసుకువెళ్లిపోతుంది. ఇక దీనికి సంబంధించిన దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. అలాగే ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

భార్యభర్తల మధ్య జరిగిన ఆ సన్నివేశాన్ని ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

View this post on Instagram

A post shared by 🅱️EWARSE GANG (@bewarsegang)

మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘వాన్ని చూస్తే వంద మందిని చంపే పులిలా ఉన్నాడు.. కానీ భార్య దగ్గర మాత్రం పిల్లి😢’ అంటూ రాసుకొచ్చాడు. మరో నెటిజన్ ‘అతను కావాలనుకుంటే తన భార్యను ఒక్క చేత్తో నలిపేయగలడు. కానీ అతనికి ఆమెపై ఉన్న ప్రేమ కారణంగా అలా చేయలేకపోయాడు’ అంటూ అతనిలో దాగిన ప్రేమ గురించి కామెంట్ చేశాడు. ‘ఎక్కువ కట్నం పెట్టి కొనుక్కున్నదేమో భర్తని. అందుకే అతను ఏమి అనడంలేద’ని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు. ఇంకోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు 1 లక్షా 80 వేల లైకులు, 30 లక్షల వీక్షణలు వచ్చాయి.అలాగే 11 వందల మంది కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu