Health: ఉప్పు ఆరోగ్యానికి ముప్పు అని తక్కువగా తీసుకుంటున్నారా.? అయితే ఈ అనారోగ్య సమస్య తప్పదు..
మనం తీసుకునే ఆహారంలో కచ్చితంగా ఉప్పు ఉండ తీరుతుంది. వంటకాలకు రుచి రావాలంటే కచ్చితంగా ఉప్పు ఉండాల్సిందే. అయితే ఉప్పు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల హృద్రోగాలు, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే..

మనం తీసుకునే ఆహారంలో కచ్చితంగా ఉప్పు ఉండ తీరుతుంది. వంటకాలకు రుచి రావాలంటే కచ్చితంగా ఉప్పు ఉండాల్సిందే. అయితే ఉప్పు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల హృద్రోగాలు, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో చాలా మంది ఉప్పును పూర్తిగా తగ్గిస్తున్నారు. ఎక్కడ బీపీ అటాక్ అవుతుతోందనని అసలు ఉప్పు జోలికి వెళ్లడం లేదు. అయితే ఉప్పు ఎక్కు తీసుకుంటే నష్టాలు ఎలాగైతే ఉన్నాయో తక్కువగా తీసుకున్నా ప్రమాదమేనని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఉప్పు తక్కువ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి.? ఆ సమస్యల నుంచి ఎలా బయటపడొచ్చు ఇప్పుడు చూద్దాం..
శరీరంలో అన్ని క్రియలు సవ్యంగా సాగాలంటే థైరాయిడ్ హార్మోన్ సక్రమంగా పనిచేయాలి. కానీ థైరాడ్ హార్మోన్ లోపం కారణంగా హైపోథైరాయిడిజం సమస్య వస్తుంది. ఇది శరీరంలో ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలకు కారణంగా మారుతుంది. శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి ఉప్పులో ఉండే అయోడిన్ కీలకం శరీరంలో అయోడిన్ లేకపోవడం హైపోథైరాయిడిజం ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ఉప్పు మరీ ఎక్కువ తీసుకున్నా ప్రమాదమేనని చెబుతున్నారు నిపుణులు. హైపోథైరాడ్ సమస్య కారణంగా నిద్రలేమి, హఠాత్తుగా గుండె వేగం పెరగడం లేదా తగ్గడం, బరువు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. తగినంత థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు సరైన ఆహారం అవసరం. హైపోథైరాయిడిజమ్‌ను నివారించడానికి సరైన ఆహారం గురించి తెలుసుకుందాం..
విటమిన్ డీ, బీ12, మెగ్నీషియం, ఐరన్ వంటివి శరీరానికి అందేలా చూడాలి. వీటితో పాటు ఎముకలు బలపరిచే, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. హైపోథైరాయిడిజం ప్రమాదాన్ని నివారించడానికి ఆకుకూరలు తినాలి. బ్రోకలీ, మొలకలు, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ వంటివి డైట్‌లో యాడ్ చేసుకోవాలి. సెలీనియం అధికంగా ఉండే చేపలు, గుడ్లు వంటి ఆహారాన్ని తీసుకోవాలి. అయితే సెలీనియం అధికకంగా తీసుకుంటే గుండెపోటు, జుట్లు రాలడం వంటి సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ రెండు అరటి పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి.




నోట్: పైన తెలిపిన వివరాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్య నిపుణుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..