Black Pepper Tea: సీజనల్ వ్యాధులతో సహా సైనస్ తో ఇబ్బంది పడుతున్నారా ఈ టీని తాగండి అద్భుత ఫలితాలు పొందండి
Black Pepper Tea: భారతీయుల వంటిల్లు ఓ ఔషధాల గని.. పోపుల పెట్టె మెడికల్ కిట్ అని ఆయుర్వేదం తెలుపుతుంది. కారం కోసం కొంతమంది ఎండు మిర్చిని ఉపయోగిస్తే.. మరికొందరు బ్లాక్ పెప్పర్ ను...
Black Pepper Tea: భారతీయుల వంటిల్లు ఓ ఔషధాల గని.. పోపుల పెట్టె మెడికల్ కిట్ అని ఆయుర్వేదం తెలుపుతుంది. కారం కోసం కొంతమంది ఎండు మిర్చిని ఉపయోగిస్తే.. మరికొందరు బ్లాక్ పెప్పర్ ను ఉపయోగిస్తారు. ప్రతి ఒక్క ఇల్లాలికి సుపరిచితమైన మసాలా దినుసు పురాతన కాలం నుండి అనేక అనారోగ్య సమస్యలను నివారించుకోవడానికి రెగ్యులర్ వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. సహజంగా జున్ను వంటి వాటి తయారీకి ఉపయోగిస్తారు.. అయితే ఏ నల్ల మిరియాలను టీలో చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చునని ఆయుర్వేదం చెబుతుంది.
నల్ల మిరియాల టీ తయారీ విధానం.. 2 కప్పుల నీరు, 1 స్పూన్ నల్ల మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 స్పూన్ నిమ్మరసం, స్పూన్ తరిగిన అల్లం తీసుకోవాలి.. ముందుగా బాణాలిలో నీళ్లు పోసి గ్యాస్ మీద వేడిచేయాలి. నీరు వేడయ్యాక నల్ల మిరియాలు, అల్లం కలపాలి. 3 నుంచి 5 నిమిషాలు మూత పెట్టి మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి అందులో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవాలి
*బ్లాక్ పెప్పర్ లో యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఈ మిరియాల పొడిని టీలో కలిపి తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అంతే కాదు, వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే విపరీతమైన జలుబు, దగ్గు ను నివారించడంలో సహాయపడుతుంది.
*వర్షాకాలంలో వచ్చే దగ్గు మరియు జలుబును తగ్గించడానికి నేచురల్ రెమెడీ. ఇది జలుబు దగ్గును నివారిస్తుంది. బ్లాక్ టీలో బ్లాక్ పెప్పర్ జోడించడం వల్ల గొంతుకు వేడిగా, స్పైసీగా అనిపిస్తుంది. దాంతో కఫంను వదులు చేస్తుంది, ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం కలుగుతుంది.
*వర్షం లో తడిస్తే.. వెంటనే గొంతు నిప్పి అనిపిస్తుంది. అలాంటి సమయంలో చిటికెడు బ్లాక్ పెప్పర్ పౌడర్ ను టీలో మిక్స్ చేసి వేడి వేడిగా తాగాలి. ఇది గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ టీని రోజుకు రెండు మూడు సార్లు తాగితే గొంతు నొప్పి నుండి వెంటనే రిలీఫ్ కలుగుతుంది.
Also Read: మందారం టీ రోజు తాగితే కలిగే ప్రయోజనాలు ఎన్నో.. తయారీ విధానం ఎలా అంటే
*సైనస్ సమస్య వర్షాకాలంలో విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. సైనస్ ఉన్నవారికి ముక్కులు మూసుకుపోయి, శ్వాసలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరు బ్లాక్ పెప్పర్ పౌడర్ మిక్స్ చేసి వేడి వేడి బ్లాక్ టీని తాగాలి. ఇది ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం కలిగిస్తుంది. సైనస్ నివారించబడుతుంది.
*బ్లాక్ పెప్పర్ మీద జరిపిన వివిధ రకాల పరిశోధనల్లో బ్లాక్ పెప్పర్ కు క్యాన్సర్ నివారించే శక్తిసామర్థ్యాలున్నట్లు నిపుణులు గుర్తించారు. బ్లాక్ పెప్పర్ లో ఉండే పెప్పరైన్ శరీరంలో క్యాన్సర్ కు కారణమయ్యే హానికరమైన రాడికల్స్ ను క్రమబద్దం చేసిన క్యాన్సర్ కు కారణమయ్యే కొన్ని ఎలిమెంట్స్ ను నివారిస్తుందని కనుకొన్నారు.. కనుక తరచుగా బ్లాక్ పెప్పర్ ను పాలల్లో కానీ.. టీగానీ తాగడం ఆరోగ్యానికి ముఖ్యంగా సీజనల్ జలుబు, దగ్గుల నివారిణిగా పనిచేస్తుంది.
Also Read: పొలం పనుల కోసం తవ్వకాలు.. బయల్పడిన అతి పురాతన శివలింగం