AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fever in child: పిల్లల ఒళ్లు కాస్త వెచ్చబడగానే జ్వరం మందు వేసేస్తున్నారా? అది ఎంత ప్రమాదకరమో తెలుసా?

పిల్లల నుదురు కాస్త వెచ్చగా ఉంటే చాలు చాలా మంది తల్లిదండ్రులు వెంటనే జ్వరం మందు వేసేస్తుంటారు. అయితే అది చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంత పరిమితి వరకూ జ్వరం మందులు వేయ కూడదని సూచిస్తున్నారు.

Fever in child: పిల్లల ఒళ్లు కాస్త వెచ్చబడగానే జ్వరం మందు వేసేస్తున్నారా? అది ఎంత ప్రమాదకరమో తెలుసా?
Fever
Madhu
|

Updated on: Feb 22, 2023 | 11:28 AM

Share

పిల్లలకు వాతావరణంలో మార్పులను బట్టి కొన్ని వ్యాధులు వ్యాపిస్తాయి. వాటిల్లో జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. పిల్లల నుదురు కాస్త వెచ్చగా ఉంటే చాలు చాలా మంది తల్లిదండ్రులు వెంటనే జ్వరం మందు వేసేస్తుంటారు. అయితే అది చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంత పరిమితి వరకూ జ్వరం మందులు వేయ కూడదని సూచిస్తున్నారు. అసలు పిల్లలకు జ్వరం మందులు ఎప్పుడు వేయాలి? నిపుణులు చెబుతున్న విషయాలు ఏమిటి? వారు చేసిన పరిశోధన ఏమిటి? ఓ సారి చూద్దాం రండి..

అతిగా మాత్రలు మంచిది కాదు..

అమెరికాలోని మిషిగన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పిల్లల జ్వరాలు, తల్లిదండ్రులు ఇస్తున్న మందులపై ఓ అధ్యయనాన్ని చేపట్టారు. అందులో 12 ఏళ్లు, అంతకన్న తక్కువ వయసున్న పిల్లలను, వారి తల్లిదండ్రులను పరిశోధించారు. పిల్లల శరీర ఉష్ణోగ్రత 100.4 డిగ్రీల ఫారెన్ హీట్ లోపే ఉన్నా కూడా ప్రతి ముగ్గురు తల్లిదండ్రులలో ఒకరు జ్వరం తగ్గించే పారాసెట్మాల్ వంటి మాత్రలు వాడుతున్నారని తేలింది. పిల్లల శరీర ఉష్ణోగ్రత 100.4 డిగ్రీల నుంచి 101.9 డిగ్రీల లోపు ఉంటే ఆ పిల్లల తల్లిదండ్రులలో ఒకరు జ్వరం మాత్రలు వాడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం మళ్లీ రాకుండా రెండో డోసు వేస్తున్నారు. అయితే ఇలాంటి స్వల్ప జ్వరాలను వాటంతటే అవే తగ్గనివ్వాలని, మందులు వాడకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పిల్లల ఒళ్లు ఎందుకు వెచ్చబడుతుంది..

పిల్లల ఒళ్లు వెచ్చబడటమనేది రోగంపై శరీర వ్యాధి నిరోధక వ్యవస్థ పోరాడే క్రమంలో జరుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు. జ్వరాన్ని తగ్గించినంత మాత్రన వారి అస్వస్థత నయమైపోయిందని భావించకూడదని హెచ్చరిస్తున్నారు. ఇలా అతిగా ముందుగానే మందులు వాడటం వల్ల పిల్లలకు మరి ఎక్కువగా దుష్ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లల నుదుటి మీద కాని నోట్లో థర్మామీటర్ ఉంచి జ్వరాన్ని నమోదు చేస్తారు. ప్రతి ఆరుగురిలో ఒకరు చంకలో కానీ, చెవిలో కానీ ఈ సాధనాన్ని ఉంచి శరీర ఉష్ణోగ్రతను తెలుసుకుంటారు. నుదుటి మీద, లేదా చెవిలో సరైన పద్ధతిలో థర్మామీటర్ వాడితేనే కచ్చితమైన ఫలితాలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..