AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Almonds: బాదంపప్పును తినేసి తొక్కను పడేస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే భద్రంగా దాచుకుంటారు..

బాదం ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. అందరికీ అందుబాటు ధరలో ఉండటంతో పాటు చిన్నా పెద్దా అందరూ ఇష్టపడుతుంటారు. మనలో చాలా మంది బాదంపప్పును నేరుగా తినకుండా నానబెట్టి..

Almonds: బాదంపప్పును తినేసి తొక్కను పడేస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే భద్రంగా దాచుకుంటారు..
Almond Peel
Ganesh Mudavath
|

Updated on: Feb 22, 2023 | 10:45 AM

Share

బాదం ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. అందరికీ అందుబాటు ధరలో ఉండటంతో పాటు చిన్నా పెద్దా అందరూ ఇష్టపడుతుంటారు. మనలో చాలా మంది బాదంపప్పును నేరుగా తినకుండా నానబెట్టి తినేందుకు ఇష్టపడతారు. అయితే.. చాలా మంది బాదం పప్పు తొక్కలను తినేటప్పుడు వాటిని పారేస్తుంటారు. కానీ.. అలా చేయడం సరికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బాదం పొట్టు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి బాదం పొట్టును తీయకుండా తినడమే మంచిది. బాదం తొక్కను మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. బాదం తొక్కలోని యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్, ప్రీబయోటిక్ లక్షణాలు మొక్కల మెటాబోలైట్స్, విటమిన్ ఇ ను పెంచుతాయి. బాదం తొక్కను కంపోస్ట్‌గా తయారు చేయడానికి, ముందుగా బాదం తొక్కలను ఎండలో బాగా ఆరబెట్టాలి. తర్వాత మెత్తగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు బాదం తొక్కతో తయారు చేసిన పొడిని మొక్కల వేర్ల దగ్గర అప్లై చేయాలి.

బాదం తొక్కను నేరుగా తినకూడదనుకునే వారు దానిని వివిధ రకాలుగా తినవచ్చు. ఉదాహరణకు… మీరు బాదం తొక్కను చట్నీ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇందు కోసం బాదం పొట్టును రాత్రంతా నానబెట్టాలి. తర్వాత వేరుశనగలు వేయించి, బాదం తొక్కతో పాటు రుబ్బుకోవాలి. తర్వాత వేడి పాన్‌లో నూనె పోసి అందులో కొద్దిగా ఉల్లిపాయ, మిరియాల పొడి, జీలకర్ర వేసి బాగా వేగించాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో బాదం తొక్క, వేరుశనగలు వేసి తగినంత ఉప్పు, చింతపండు రసం కలపాలి. చివరగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి, బాదం చట్నీతో కలపాలి.

బాదంపప్పుతో చేసిన బాడీ వాష్ యాంటీ ఏజింగ్ లక్షణాల సహాయంతో చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందుకోసం 1 టేబుల్ స్పూన్ బాదంపప్పు పొట్టుకు 2 టేబుల్ స్పూన్ల పాలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా రోజ్ వాటర్, తేనె కలిపి 5 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాడీ స్క్రబ్, ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేయాలి. ప్రకృతి సిద్ధంగా లభించే పదార్థాలకు బాదంపప్పును మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..