Infertility: మహిళల్లో పెరుగుతున్న ఇన్ఫర్టిలిటీ.. కీలక సూచనలు చేసిన వైద్యులు
ప్రస్తుతం మహిళల్లో ఇన్‌ఫర్టిలిటీ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు దంపతుల్లో ఇన్‌ఫర్టిలిటీ రేటు 13 శాతం ఉండగా.. ఇప్పుడు 16 శాతం దాటిపోవడం ప్రమాద ఘంటికలను మోగిస్తుంది. దీనిపై కర్నూలు ప్రభుత్వాసుపత్రి ప్రొఫెసర్, ప్రముఖ గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఇన్ ఫెర్టిలిటీ రేటు 8% నుంచి 12% వరకు పెరిగిపోయిందని పేర్కొన్నారు. భారత జనాభా లెక్కల ప్రకారం సౌత్ ఇండియాలో ఈ ఇన్‌ఫెర్టిలిటీ రేటు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం మహిళల్లో ఇన్‌ఫర్టిలిటీ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు దంపతుల్లో ఇన్‌ఫర్టిలిటీ రేటు 13 శాతం ఉండగా.. ఇప్పుడు 16 శాతం దాటిపోవడం ప్రమాద ఘంటికలను మోగిస్తుంది. దీనిపై కర్నూలు ప్రభుత్వాసుపత్రి ప్రొఫెసర్, ప్రముఖ గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఇన్ ఫెర్టిలిటీ రేటు 8% నుంచి 12% వరకు పెరిగిపోయిందని పేర్కొన్నారు. భారత జనాభా లెక్కల ప్రకారం సౌత్ ఇండియాలో ఈ ఇన్‌ఫెర్టిలిటీ రేటు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గోవా రాష్ట్రాలే కాకుండా.. ఉత్తర భారతదేశంలో హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, సిక్కింలలో కూడా ఈ ఇన్ఫెర్టిలిటీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అసలే పిల్లలు పుట్టకపోవడం అనే ప్రైమరీ ఇన్ ఫర్టిలిటీ కంటే సెకండరీ ఇన్ ఫర్టిలిటీ అంటే ఒకసారి గర్భం వచ్చి అబార్షన్ అయ్యి తర్వాత పిల్లలు పుట్టకపోవడం లాంటి ఉదంతాలు ఎక్కువ కావడం మారుతున్న జీవనశైలిని సూచిస్తుందని అలీ అనే ముంబైకి చెందిన ప్రముఖ డెమోగ్రాఫర్ పాపులేషన్ సైంటిస్ట్ పేర్కొన్నారు.
ఇన్ఫర్టిలిటీ పెరిగే కారణాలను చూసుకుంటే మనకు ధూమపానం, ఆల్కహాల్, మారుతున్న జీవనశైలి, ఒబిసిటీ, గర్భనిరోధక మాత్రలు వాడడం, అబార్షన్ కావడం, సుఖ వ్యాధులు మరియు కొంత మందితో లైంగిక సంబంధాలు కలిగి ఉండడం ప్రధాన కారణాలుగా తెలుస్తుంది. ఇదే కాకుండా ధ్వని కాలుష్యము, వాతావరణం, వేడి ప్రదేశంలో ఉండడము కూడా ఇందుకు కారణంగా గుర్తించారు. చాలామందికి అధునాతన వైద్య సదుపాయాలు లభించకపోవడం కూడా భారతదేశంలో ఇన్ఫిర్టిలిటీ పెరగడానికి కారణాలుగా గుర్తించారు. అయితే ఈ ఇన్ఫర్టిలిటీ అనేది మగవాళ్ల కంటే ఆడవాళ్ళలోనే ఎక్కువగా ఉంది. మానసిక ఒత్తిడిలు, కుటుంబ సమస్యలు, సామాజిక సమస్యలు మహిళలకు ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అందువల్ల మహిళలలో ఇన్ ఫర్టిలిటీ సమస్య ఎక్కువగా ఉంది. దక్షిణ భారతదేశంలో జరుగుతున్న ఇన్ఫర్టిలిటీ సమస్య మొత్తం.. దేశ ఫర్టిలిటీ రేట్లో గణనీయమైన మార్పును తెస్తోంది. ఇది భావితరాలలో రిప్రొడక్టివ్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తూ మన ఎకానమీని దెబ్బతీసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ధూమపానం, మద్యపానం, పబ్ కల్చర్, మాదకద్రవ్యాలు, జోలికి వెళ్లకుండా వీలైనంతవరకు కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడకుండా, అబార్షన్లకు దూరంగా ఉంటూ, లైంగిక విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే శబ్ద కాలుష్యాన్ని తగ్గించుకొని, మంచి ఆహార నియమాలతో ఒబిసిటీ బారిన పడకుండా ఉంటే ఈ ఇన్ఫర్టిలిటీ నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు. దీనివల్ల మన దేశం ఆర్థిక ప్రగతిలో కూడా యువత భాగస్వామ్యం అవుతారని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








