AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun Benefits: కాసేపు ఎండలో కూర్చోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

శీతాకాలంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకు కారణం శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ తగ్గడమే. దానికి తోడు విపరీతమైన చలి, పొగ మంచు కారణంగా జలుబు, దగ్గు, చర్మ, జుట్టు సమస్యలు ఎదురవుతాయి. ఈ సీజన్‌లో ఎక్కువగా అనారోగ్య పాలవుతూ ఉంటారు. ఈ సీజన్‌లో తీసుకునే ఆహారం, దుస్తుల విషయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. సరిగ్గా ఇదే సమయంలో ఎండ కోసం జనం ఎదురు చూస్తూ ఉంటారు. ఎండ చలి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా..

Sun Benefits: కాసేపు ఎండలో కూర్చోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?
Sun Benefits
Chinni Enni
| Edited By: |

Updated on: Dec 31, 2023 | 7:09 PM

Share

శీతాకాలంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకు కారణం శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ తగ్గడమే. దానికి తోడు విపరీతమైన చలి, పొగ మంచు కారణంగా జలుబు, దగ్గు, చర్మ, జుట్టు సమస్యలు ఎదురవుతాయి. ఈ సీజన్‌లో ఎక్కువగా అనారోగ్య పాలవుతూ ఉంటారు. ఈ సీజన్‌లో తీసుకునే ఆహారం, దుస్తుల విషయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. సరిగ్గా ఇదే సమయంలో ఎండ కోసం జనం ఎదురు చూస్తూ ఉంటారు. ఎండ చలి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా.. ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. శీతా కాలంలో కాసేపు ఎండలో కూర్చుంటే ఎన్ని లాభాలు ఉన్నయో ఒక లుక్ వేసేద్దాం.

గుండెకు మేలు:

వింటర్ సీజన్‌లో ఎండలో కూర్చోవడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. సూర్యరశ్మి నైట్రిక ఆక్సైడ్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది అధిక రక్త పోటను తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగకపోవడమే చాలా మంచిది.

మానసిక స్థితి మెరుగు పడుతుంది:

ఉదయం లేదా సాయంత్రం ఎండలో కూర్చోవడం వల్ల ఉల్లాసంగా ఉంటుంది. సూర్య రశ్మి న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ చేస్తుంది. దీని వల్ల సంతోషంగా ఉంచగలికే హార్మోన్లు రిలీజ్ అవుతాయి.

ఇవి కూడా చదవండి

పుష్కలంగా విటమిన్ డి:

ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు విటమిన్ డి చాలా అవసరం. శరీరానికి కావాల్సినంత విటమిన్ డి అందడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధంగా రోగ నిరోధక శక్తి కూడా అందుతుంది. దీని వల్ల ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు.

మంచి నిద్ర పడుతుంది:

కాసేపు ఎండలో ఉండటం వల్ల ఒత్తిడి వంటివి కూడా దూరమవుతాయి. అంతే కాకుండా మీ శరీరం అంతర్గత గడియారం నియంత్రనలో ఉంటుంది. ఇది మీరు రాత్రిళ్లు సరిగ్గా పడుకోవడానికి హెల్ప్ చేస్తుంది.

చర్మం ఆరోగ్యంగా ఉంటుంది:

శీతా కాలంలో ప్రతిరోజు ఎండలో కాసేపు కూర్చోవడం వల్ల శరీరానికి విటమిన్ డి అనేది బాగా అందుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా విటమిన్ చాలా అవసరం. ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఎనర్టీ లెవల్స్ పెరుగుతాయి:

సాధారణంగా శీతా కాలంలో బద్ధకంగా ఉంటుంది. ఏ పని చేయాలని అనిపించదు. ఎక్కువగా పడుకోవాలని అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే.. ప్రతి రోజూ సూర్య రశ్మిలో ఉండటం వల్ల మీ ఎనర్టీ లెవల్స్ అనేవి పెరుగుతాయి. దీంతో అలసట అనే భావన తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..