Save Corona from Children: కరోనా రాకుండా మీ పిల్లల్ని ఇలా కాపాడుకోండి!
ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత్, చైనా, యూకే, అమెరికా వంటి దేశాల్లో 150 మందికి పైగా జేఎన్.1 వేరియంట్ బారిన పడ్డట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ వేరియంట్ మరింత వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లు ఈ కొత్త వేరియంట్ నుంచి పూర్తి రక్షణ ఇస్తాయో లేదో తెలీదని అంటున్నారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని.. ముఖ్యంగా పిల్లలకు ఎక్కువగా..

ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత్, చైనా, యూకే, అమెరికా వంటి దేశాల్లో 150 మందికి పైగా జేఎన్.1 వేరియంట్ బారిన పడ్డట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ వేరియంట్ మరింత వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లు ఈ కొత్త వేరియంట్ నుంచి పూర్తి రక్షణ ఇస్తాయో లేదో తెలీదని అంటున్నారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని.. ముఖ్యంగా పిల్లలకు ఎక్కువగా సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి పిల్లల్ని కరోనా బారి నుంచి ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చేతులు కడుక్కోవడం:
పిల్లలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే.. తరచూ సబ్బుతో చేతులు కడుక్కుంటూ ఉండాలి. నోటికి, ముక్కుకి మాస్క్ ఖచ్చితంగా ఉండేలా చేయండాలి. సామాజిక దూరం ఉండాలని చెప్పాలి. అలాగే గుంపులు గుంపులుగా ఉండకూదని చెబుతూ ఉండాలి.
ఆరోగ్యకరమైన ఆహారం:
పిల్లలకు వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్నే పెట్టాలి. విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం అందిస్తే.. వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అలాగే ఉదయాన్నే పిల్లలతో కొద్ది సేపైనా ఎక్సర్‌సైజ్ చేయించాలి. వ్యాయమం చేయడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి అనేది బలోపేతం అవుతుంది. అలానే శరీరం కూడా ఫిట్ ఉంటుంది. దీంతో రోగాలు దరి చేరకుండా ఉంటాయి.
మాస్క్ ధరించడం:
ప్రత్యేకంగా వారికి మాస్క్ ధరించడం నేర్పించాలి. రద్దీగా ఉన్నప్పుడు లేదా బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోమని చెప్పాలి.
గోరు వెచ్చటి నీరు తాగాలి:
మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తుంది కాబట్టి.. గోరు వెచ్చటి నీరు తాగడం చాలా మంచిది. దీని వల్ల శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి పెరిగి.. వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.
వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూడాలి:
ఇంట్లో వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. వెంటిలేషన్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పిల్లలు ఆడుకోవడం, చదువు కోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు.
వ్యాక్సినేషన్లు వేయించండి:
కరోనాను నివారించాలంటే వ్యాక్సినేషన్ సరైన మార్గం. మీ పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. వారికి వ్యాక్సినేషన్‌కు సంబంధించిన అన్ని కొత్త మార్గ దర్శకాల గురించి చెప్పాలి. అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరూ పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకునేలా తల్లిదండ్రులు చూసుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.




