AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Walking Benefits: వాకింగ్ చేస్తున్నారా.. అయితే ఏ వయస్సు వారు ఎంత సేపు నడవాలో తెలుసా?

వాకింగ్ చేస్తున్నారా? రోజు వాకింగ్ చేసే అలవాటు ఉందా? అడ్డదిడ్డంగా వాకింగ్ చేస్తున్నారా? ఓవర్‌గా వాకింగ్ చేసినా, స్లోగా వాకింగ్ చేసిన ఇంకా అంతే సంగతులు.. ఏ వయస్సు వారు ఎంత సేపు నడవాలో తెలుసా?

Walking Benefits: వాకింగ్ చేస్తున్నారా.. అయితే ఏ వయస్సు వారు ఎంత సేపు నడవాలో తెలుసా?
Walking Benefits
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Nov 16, 2024 | 6:58 PM

Share

మోస్ట్ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఎక్సర్‌సైజ్‌ ఏదైనా ఉంది అంటే అది వాకింగ్ అని చెప్పవచ్చు. గుండె సమస్యలకి, శరీరంలో కొవ్వు తగ్గడానికి వాకింగ్‌ను మించింది లేదు. కానీ వాకింగ్ చేయడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. మీ వయస్సుకి తగ్గట్టుగా.. మీ శరీర బరువుకు తగ్గట్టుగా నడక మొదలుపెట్టాలి. ఓవర్‌గా వాకింగ్ చేసినా, ఏదో పెళ్లికి వెళ్తున్నాం అన్నట్లుగా స్లోగా చేసిన నష్టమే.. అంతర్జాతీయ వైద్య నిపుణులు చెప్తున్న దాని ప్రకారం 18 నుంచి 30 ఏళ్ల వయస్సు వాళ్ళు రోజు 30 నుంచి 60 నిమిషాల వాకింగ్ చేయవచ్చు. 30 నిమిషాలకు తగ్గితే అది శరీరంపై ఏమాత్రం ప్రభావం చూపించదు. అలాగని 60 నిమిషాల తర్వాత కూడా వాకింగ్ చేస్తే అలసటకు గురవుతారు. కానీ బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం రోజు 10 నిమిషాల నుంచి మొదలుపెట్టి 30 నిమిషాల వరకి పది రోజుల్లో ప్లాన్ చేసుకోవాలి.

ఇక 31 నుంచి 50 సంవత్సరాల వయసున్న వారు కనీసం 30 నిమిషాలు గరిష్టంగా 45 నిమిషాలు చేయాలి. ఈ వయసులో రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం వల్ల బరువు కంట్రోల్‌లో  ఉంటుంది. మెటబోలిజం పెరుగుతుంది. 30 నుంచి 45 నిమిషాల మధ్య నార్మల్ స్పీడ్లో వాకింగ్ చేయాలి. దీనివల్ల స్ట్రెస్ తగ్గుతుంది, కండరాలు గట్టి పడతాయి. 51 నుంచి 65 ఏళ్ల వయసున్న వాళ్లు.. 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు వాకింగ్ స్లోగా చేయాలి. దీని ద్వారా ఎముకలు బలంగా ఉంటాయి. జాయింట్స్ ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణశక్తి మెరుగవుతుంది. 66 నుంచి 75 ఏళ్ల వయసున్న వృద్ధులు 20 నిమిషాలు వాకింగ్ చేస్తే సరిపోతుంది. ఇది రోజువారి ఆరోగ్య విధానాన్ని కొత్త చురుగ్గా ఉండేలా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి కోల్పోకుండా ఉంటారు.

ఇది కూడా చదవండి: జిమ్ వెళ్లే టైమ్ లేదా? అయితే ఈ 4 వ్యాయామాలు చేస్తే అంతా సెట్!!

ఇలా ఓ పద్ధతి ప్రకారం వాకింగ్ చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. ఏదో గుర్తుకొచ్చినప్పుడు కాకుండా ప్రతిరోజు వాకింగ్ చేయడం ద్వారా జీవిత కాలాన్ని పెంచుకునే అవకాశం ఉంది. బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు ఏటవాలుగా ఉన్న వాకింగ్ ట్రాక్ పై కాకుండా సాధారణంగా ఉండే వాకింగ్ ట్రాక్ పై వాకింగ్ చేయాలని చూస్తున్నారు. చాలామంది ఇళ్లలో ట్రెడ్‌మిల్‌‌పై వాకింగ్ చేస్తూ ఉంటారు. దీనికంటే నేలపైన వాకింగ్ చేయడం ద్వారా 30% ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. రోజు నడక ద్వారా విటమిన్ డి కూడా శరీరానికి అందుతుంది. ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్న వాకింగ్‌ను వయసును బట్టి చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. నడక బరువు తగ్గడంలో సహాయపడుతుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రక్త ప్రసరణ, ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తుంది. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, చిత్తవైకల్యం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సమర్థవంతమైన మార్గం వాకింగ్ అని నిపుణులు చెబుతున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి