Diabetes Care: డయాబెటిస్ రోగులు అలెర్ట్.. షుగర్ కంట్రోల్‌లో పెట్టుకోకపోతో ఆ సమస్య వచ్చే చాన్స్…

డయాబెటిస్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ప్రమాదకరమైన వ్యాధులకు ఒక ఎంట్రీ పాస్ గా మారుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వ్యక్తికి గుండె జబ్బులు కిడ్నీ జబ్బులు అదే విధంగా కాలేయమని సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు.

Diabetes Care: డయాబెటిస్ రోగులు అలెర్ట్.. షుగర్ కంట్రోల్‌లో పెట్టుకోకపోతో ఆ సమస్య  వచ్చే చాన్స్...
Diabetes
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 29, 2023 | 11:10 AM

డయాబెటిస్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ప్రమాదకరమైన వ్యాధులకు ఒక ఎంట్రీ పాస్ గా మారుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వ్యక్తికి గుండె జబ్బులు కిడ్నీ జబ్బులు అదే విధంగా కాలేయమని సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా డయాబెటిస్ శరీరంలోని కీలక భాగాల పైన దాడి చేస్తుందని తద్వారా ప్రమాదకరమైన జబ్బులు సైతం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒకసారి డయాబెటిస్ ప్రభావితులైన తర్వాత రక్తంలో షుగర్ను ఎప్పటికప్పుడు కంట్రోల్ లో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే డయాబెటిస్ కారణంగా డిమెన్షియా వ్యాధి సైతం ప్రభలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిమెన్షియా అంటే చిత్త వైకల్యం అని అర్థం. ఈ వ్యాధికి గురైన వారు మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డయాబెటిస్ కారణంగా నాడీ సంబంధిత వ్యాధులు సైతం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో. మెదడులోని కొన్ని కీలక ప్రదేశాల్లో షుగర్ కారణంగా ఎపిలెప్సీ వచ్చే అవకాశం ఉందని ఫలితంగా అది డిమెన్షియా కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

డయాబెటోలోజియాలో ప్రచురించిన కొత్త పరిశోధన ప్రకారం యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ జర్నల్ టైప్ 2 డయాబెటిస్, డెమెన్షియా వ్యాధి బారినపడే అవకాశముందని తేల్చింది. “ప్రీ డయాబెటిస్ డిమెన్షియా రిస్క్‌తో ముడిపడి ఉంటుంది.. అయితే ఈ ప్రమాదం మధుమేహం ముదరడం ద్వారా వచ్చినట్లు పేర్కొంది. చిన్న వయస్సులోనే మధుమేహం రావడం అనేది చిత్తవైకల్యంతో చాలా బలంగా సంబంధం కలిగి ఉంటుంది” అని జియాకి హు, జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ ప్రొఫెసర్ ఎలిజబెత్ సెల్విన్ చేసిన అధ్యయనం తెలిపింది. రచయితలు అథెరోస్క్లెరోసిస్ రిస్క్ ఇన్ కమ్యూనిటీస్ (ARIC) అధ్యయనంలో పాల్గొన్న వారి నుండి ఈ డేటాను విశ్లేషించారు.

ఇవి కూడా చదవండి

డయాబెటిస్ ఉన్న రోగుల్లో చిత్తవైకల్యం పెరిగే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయంగా మరికొన్ని పరిశోధనా పత్రాలు కూడా ఘంటపథంగా చెబుతున్నాయి. ఇదిలా ఉంటే డయాబెటిస్ను అదుపులో ఉంచుకుంటే అనేక వ్యాధులు తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇందుకు మందులు వేసుకుంటే సరిపోదని జీవిత శైలిలో కూడా మార్పులు రావాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ముఖ్యంగా డయాబెటిస్ రిస్క్ ను పెంచే ఆహారాలు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఇందులో ప్యాకేజ్డ్ ఫుడ్, కూల్డ్రింకులు ఐస్ క్రీమ్ వంటివి ముందు వరుసలో ఉన్నాయి అలాగే గంటల తరబడి శ్రమ చేయకుండా ఆఫీసుల్లో కూర్చోవడం కూడా డయాబెటిస్ రిస్కులు పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.

అందుకే డయాబెటిస్ రాకుండా ఉండాలంటే మీ వయసు 35 సంవత్సరాలు దాటినప్పటి నుంచి కూడా తరచుగా బ్లడ్ షుగర్ ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ప్రీ బయోటిక్ దశ నుంచే రక్తంలో షుగర్ అదుపులో ఉంచుకుంటే, శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతినకుండా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం