Health tips: మీరు ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు మరింత జటిలం.. జాగ్రత్త..!

ఖాళీ కడుపుతో వేడి టీ తాగడం మన ఆరోగ్యానికి చాలా హానికరం. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రధాన విషయం ఏమిటంటే, ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల

Health tips: మీరు ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు మరింత జటిలం.. జాగ్రత్త..!
Drink Tea
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 09, 2022 | 7:39 AM

చాయ్.. చాలామందికి ప్రియమైన పానీయం.. ఉదయం నిద్రలేవగానే టీ తాగందే చాలా మందికి రోజు గడవదు. కప్పు చాయ్‌ కడుపులో పడగానే చాలామందికి ఉత్తేజనిచ్చేది. శరీరంలో చల్లదనం ఎక్కువైనప్పుడు వేడి కోసం గరంగరం చాయ్‌ తాగాల్సిందే. సాయంత్రం వేళ వేడిగా ఏదైనా తాగాలనిపించినా మొదట గుర్తొచ్చేది టీ. అయితే వీళ్లందిరిలో ఉదయం టీతాగే అలవాటు అయితే తప్పక ఉంటుంది. తెల్లవారు నిద్రలేవగానే టీ లేదా కాఫీని తాగడం వల్ల రోజును ఫ్రెష్‌గా ప్రారంభించే వీలుంటుందనేది ప్రతి ఒక్కరి భావన. అయితే ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంటే, ఖాళీ కడుపుతో వేడి టీ తాగడం మన ఆరోగ్యానికి చాలా హానికరం. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రధాన విషయం ఏమిటంటే, ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. అంతే కాదు ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. మీరు టీ ప్రియులైతే, ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కలిగే నష్టాలు తప్పక తెలుసుకోండి.

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కలిగే హాని.. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది. తేలికపాటి ఎసిడిటీ సమస్య ఉంటే టీ అస్సలు తాగకూడదని, ఇది ఎసిడిటీకి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. మీరు ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు, శరీరానికి అవసరమైన పోషకాలు లోపిస్తాయి. కాబట్టి ఆకలి క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కొంతమందిలో గుండెల్లో మంట, వాంతులు కూడా అవుతుంది. అయితే, ఇది ఇతర కడుపు సంబంధిత సమస్యలకు కూడా దారి తీస్తుంది.

మీరు నిద్రలేమి లేదా ఒత్తిడితో బాధపడుతుంటే, ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అంటే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల నిద్రలేమి మరింతగా పెరుగుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. ఇది నోటి ఆరోగ్యాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా