Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: టేస్ట్‌ కోసం ఎర్ర కారం ఎక్కువగా తింటున్నారా..? ఆరోగ్యానికి ఎంత నష్టమో తెలుసా?

దీని కణాలు కడుపు, ప్రేగులకు అంటుకుంటాయి. క్రమంగా ఇది అల్సర్లకు కారణమవుతుంది. ఇక స్త్రీలు గర్భధారణ సమయంలో ఎర్ర మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల శిశువుకు..

Health Tips: టేస్ట్‌ కోసం ఎర్ర కారం ఎక్కువగా తింటున్నారా..?  ఆరోగ్యానికి ఎంత నష్టమో తెలుసా?
Red Chilli
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 04, 2023 | 8:12 AM

భారతదేశాన్ని సుగంధ ద్రవ్యాల భూమి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ దేశం ఎప్పటి నుంచో ప్రపంచానికి సుగంధ ద్రవ్యాలను అందిస్తుంది. మితిమీరిన అమృతం విషంలాగా లవణం పొడిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని గుర్తుంచుకోవాలి. అయితే కొంతమందికి రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది. లవణం తక్కువగా ఉందని, రేపటి నుంచి ఎక్కువ ఉప్పు వేయాలని కూడా రుచికరమైన భోజన ప్రియులు సూచనలు ఇస్తుంటారు. అధిక కారం వినియోగం వల్ల శరీరానికి కలిగే నష్టాలు ఏమిటి? దీని గురించి తెలుసుకుందాం.

ఎక్కువ కారంతో కలిగే అనర్థాలు.. చాలా ప్రజాదరణ పొందిన మసాలా ఎర్ర మిరప కారం.. ఏదైనా వంటకానికి రుచిని జోడిస్తుంది. పప్పుతో సహా అనేక వంటకాలు కారం లేకుండా అసంపూర్ణంగా కనిపిస్తాయి. కానీ ఎక్కువ కారం పొడిని, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు దారి తీస్తుంది. వంటల్లో కారం ఎక్కువ తినేవారు తరచూ డయేరియా బారిన పడుతుంటారు. కారం ఎక్కువగా తింటే కడుపుకు మంచిది కాదు. ఇది పరిమిత పరిమాణంలో తినాలి. సాధారణంగా మసాలా దినుసులు డీప్ ఫ్రై చేసినప్పుడు అవి పొట్ట లోపలి భాగంలో అతుక్కుని సమస్యలను కలిగిస్తాయి.

ఎసిడిటీ: ఎర్ర మిరపకాయలు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ఇది కడుపులో ఎసిడిటీని కలిగిస్తుంది. అలాగే కొంతమంది తరచుగా గుండెల్లో మంట అంటుంటారు. మీరు అలాంటి సమస్యతో బాధపడుతుంటే వెంటనే ఎర్ర మిరపకాయలు తీసుకోవడం మానేయండి. బలహీనత, మూర్ఛ ఇంకా అలాగే మైకము మొదలగు వికారాలు కలుగుతాయి. ఇక కారంపొడి ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటిపూత వచ్చే ఛాన్స్ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

కడుపులో పుండు: సాధారణంగా వైద్యులు ఎర్ర మిరపకాయలను తక్కువగా తినమని సూచిస్తారు. ఎందుకంటే కడుపులో పుండు వస్తుందనే భయం ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా కారం పొడి చాలా ప్రమాదకరం. దీని కణాలు కడుపు, ప్రేగులకు అంటుకుంటాయి. క్రమంగా ఇది అల్సర్లకు కారణమవుతుంది. ఇక స్త్రీలు గర్భధారణ సమయంలో ఎర్ర మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల శిశువుకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే ఛాన్స్ ఎక్కువగా వుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హిందీని రుద్దడాన్ని నేను వ్యతిరేకించాను!
హిందీని రుద్దడాన్ని నేను వ్యతిరేకించాను!
భానుడి భగభగలు.. ఏపీలో ఆ జిల్లాలోనే అత్యధికం!
భానుడి భగభగలు.. ఏపీలో ఆ జిల్లాలోనే అత్యధికం!
మిత్రుడి మరణం.. తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించిన ఏనుగు..
మిత్రుడి మరణం.. తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించిన ఏనుగు..
బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో మైండ్ బ్లాక్ చేస్తున్న రంగస్థలం బ్యూటీ
బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో మైండ్ బ్లాక్ చేస్తున్న రంగస్థలం బ్యూటీ
జాక్‌పాట్‌ కొట్టిన గోల్డ్‌ బాండ్స్‌ ఇన్వెస్టర్లు.. మూడింతల లాభం!
జాక్‌పాట్‌ కొట్టిన గోల్డ్‌ బాండ్స్‌ ఇన్వెస్టర్లు.. మూడింతల లాభం!
అప్పుడే పుట్టిన బిడ్డను చంపేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టేసిన స్త్రీ
అప్పుడే పుట్టిన బిడ్డను చంపేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టేసిన స్త్రీ
చేతిరాత బడ్జెట్టును ప్రవేశపెట్టిన మంత్రి వీడియో
చేతిరాత బడ్జెట్టును ప్రవేశపెట్టిన మంత్రి వీడియో
వయ్యారాలతో మతిపోగొడుతున్న ఆర్జీవీ హీరోయిన్..
వయ్యారాలతో మతిపోగొడుతున్న ఆర్జీవీ హీరోయిన్..
అమెరికాలో సుదీక్ష మిస్సింగ్‌.. ఆ బీచ్‌లో ఏం జరిగి ఉంటుంది?వీడియో
అమెరికాలో సుదీక్ష మిస్సింగ్‌.. ఆ బీచ్‌లో ఏం జరిగి ఉంటుంది?వీడియో
ఎండాకాలం వచ్చింది.. ఏటవుతుందో.. భయపెడుతున్న బండరాయి
ఎండాకాలం వచ్చింది.. ఏటవుతుందో.. భయపెడుతున్న బండరాయి