Fruits: భోజనం చేసిన వెంటనే పండ్లను తినొచ్చా..? మరి ఎలాంటి సమయంలో తినాలి..?

ఈ రోజుల్లో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. రకరకాల వైరస్‌లు, వ్యాధులు చుట్టుముట్టడంతో ఆరోగ్యం దెబ్బతింటోంది. అయితే రోజువారీగా తినే ఆహారంతో పాటు పండ్లను తిసుకుంటే..

Fruits: భోజనం చేసిన వెంటనే పండ్లను తినొచ్చా..? మరి ఎలాంటి సమయంలో తినాలి..?
Fruits
Follow us
Subhash Goud

|

Updated on: Jan 04, 2023 | 8:00 AM

ఈ రోజుల్లో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. రకరకాల వైరస్‌లు, వ్యాధులు చుట్టుముట్టడంతో ఆరోగ్యం దెబ్బతింటోంది. అయితే రోజువారీగా తినే ఆహారంతో పాటు పండ్లను తిసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ప్రతి రోజు పండ్లను తిసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అదే విధంగా తిన్న తర్వాత పండ్లను తీసుకోవడం మంచిదేనా.? కాదా అనే అనుమానాలు చాలా మందిలో తలెత్తుతుంటాయి. వైద్య నిపుణుల నివేదికల ప్రకారం.. ఆహారం తీసుకున్న తర్వాత పండ్లు తీసుకోవడం శరీరానికి మంచిది కాదని అనేక నివేదికలు చెబుతున్నాయి. మీరు తిన్న తర్వాత పండ్లు తింటే మీ శరీరానికి హాని కాకపోయినా.. సరైన పోషకాలు అందవని వైద్యులు సూచిస్తున్నారు.

ఖాళీ కడుపుతో పండ్లను తీసుకోవడం మరింత ప్రయోజనం కలుగుతుంది. కానీ.. కడుపు నిండిన తర్వాత పండ్లను తీసుకుంటే పండ్లును జీర్ణం చేసుకోవడంలో కడుపు ఇబ్బంది పడుతుంది. దీని వల్ల పండ్ల ద్వారా శరీరానికి పూర్తి స్థాయిలో పోషకాలు అందలేవు. అందు వల్ల ఆహారం తిన్న చాలా సమయం తర్వాత పండ్లను తినడం మంచిదంటున్నారు. అయితే చాలా మంది డైటీషియన్లు కూడా భోజనం చేసిన కొన్ని గంటల తర్వాత పండ్లు తినవచ్చని చెబుతుంటారు. చాలా పండ్లలో విటమిన్‌ సి పుష్కలంగా ఉన్నందున జీర్ణక్రియలో సహాయపడుతుందని చెబుతుంటారు. కొన్ని పండ్లు సులభంగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కావు.

ఆహారం తిన్న వెంటనే పండ్లను తినొచ్చా..?

ఆహారం తిన్న తర్వాత పండ్లు తినాలనుకుంటే ఆహారం తిన్న వెంటనే తీసుకోకూడదు. భోజనం చేసిన కొంత సమయం తర్వాత పండ్లను తీసుకోవడం మేలు. లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. భోజనం చేసిన కొన్ని గంటల తర్వాత పండ్లను తింటే అవి సులభంగా జీర్ణమయ్యే అవకాశం ఉంది. అప్పుడు శరీరానికి పూర్తి స్థాయిలో పోషకాలు అందుతాయి.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధకశక్తికి పండ్లు కీలకం కావడంతో అందరూ వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో పెద్దగా ఆసక్తి చూపని వారు సైతం పండ్లు తింటున్నారు. దీంతో డిమాండ్‌ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా బత్తాయి, నారింజ, దానిమ్మ, కివీ, బొప్పాయి, జామ, ద్రాక్ష, ఆపిల్‌ తదితర పండ్లలో ‘సీ’ విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. పండ్లు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు కానీ.. ఏ పండుతో ఎటువంటి పోషకాహారాలు లభిస్తాయి ? ఏ పండుతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి మాత్రం కొందరికే తెలుసు. అసలే రకరకాల రోగాలు, ఇన్‌ఫెక్షన్స్, ముఖ్యంగా కరోనావైరస్‌ సోకున్న సమయంలో పండుతో ఒంటికి ఎటువంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకోవడం బెటర్‌. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా కాపాడే శక్తి పండ్ల ఉంటుంది. అంతేకాదు.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైన అలర్జీ, తుమ్ములు, గ్యాస్ వంటివాటిని కూడా పండ్లు నివారిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకు వైద్యులు కూడా పండ్లను ఎక్కువగా తీసుకోవాలని పదేపదే సూచిస్తుంటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?