రోజూ ఈ చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారా ? అయితే జాగ్రత్త సుమా.. ఆరోగ్యానికి యమ డేంజర్ అంటున్న నిపుణులు..
కరోనా కారణంగా.. ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పండ్లు తీసుకోవడం..
కరోనా కారణంగా.. ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పండ్లు తీసుకోవడం.. పురాతన వంటకాలను తినడం.. కఠినమైన వ్యాయమాలు చేయడం లేదా.. ఇంట్లో చేసిన కషాయాలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కేవలం తీసుకునే ఆహారం వలన మాత్రమే కాకుండా.. మనం రోజూ వారీ చేసే పనులపై కూడా రోగ నిరోధక శక్తి ఆధారపడి ఉంటుందంట. ఇటీవల ప్రముఖ డైటీషియన్ మాన్సీ పడేచియా.. తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసుకున్నారు. శరీరం చాలాసార్లు బలమైన రోగ నిరోధక శక్తిని చూపిస్తుంది. శరీరానికి ఎక్కువగా శ్రమ కల్పించినప్పుడు రోగ నిరోధక శక్తిపై ఆధారపడుతుంది. జలుబు, ఫ్లూ నుంచి కోలుకున్నప్పుడు రోగ నిరోధక శక్తి సామార్థ్యం గురించి తెలుస్తోంది. అయితే మనం రోజూ వారీ జీవన శైలిలో చేసే కొన్ని మార్పుల వలన రోగ నిరోధక శక్తి తగ్గిపోయి.. బలహీనంగా మారే అవకాశాలు ఉంటాయి.
ట్వీట్..
View this post on Instagram
1. నిద్ర లేకపోవడం..
శరీరం రోగ నిరోధక పనితీరుకు సహాయపడే ఒక రకమైన ప్రోటీన్ సైటోకిన్‌లను విడుదల చేస్తుంది. కానీ ఇది నిద్రలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. కాబట్టి నిద్ర లేకపోవడం అనేది మీ రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది.
2. ఆందోళన మరియు ఒత్తిడి
ఒత్తిడి హార్మోన్ కార్టికోస్టెరాయిడ్ లింఫోసైట్ల సంఖ్యను తగ్గించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
3. పండ్లు.. కూరగాయలు..
గింజలు.. విత్తనాలు, జింక్, బీటా కెరోటిన్, విటమిన్స్ ఎ, సీ, ఇ, ఇతర పోషకాలను తెల్ల రక్త కణాలు లేదా డబ్ల్యూబీసీల సృష్టికి సహయపడతాయి.
4. విటమిన్ డి తక్కువ..
విటమిన్ డి గ్రాహకాలు అనేక రకాల రోగనిరోధక కణాలపై ఉన్నాయి. అంటువ్యాధులను అరికట్టడానికి చురుకుగా పనిచేస్తాయి.
5. వ్యాయామం లేకపోవడం
ఏరోబిక్ వ్యాయామాలు శరీరంలో రక్తం మరింత సమర్థవంతంగా రావడానికి సహాయపడతాయి. అనగా సూక్ష్మక్రిమితో పోరాడే పదార్థాలు అందుతాయి.
Also Read: Shilpa Shetty: భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన శిల్పా శెట్టి.. ఏమన్నదంటే..
Sonam Kapoor: ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు అలా ఫుల్‌స్టాప్ పెట్టిన టాప్ హీరోయిన్.. అసలు విషయం ఇదే అంటూ..