Detox Water: వేసవిలో అన్ని సమస్యలకు ఒకటే ఔషధం.. డిటాక్స్ వాటర్.. ప్రయోజనాలు తెలిస్తే షాకే..
Detox Water in Summer: ఆరోగ్యంగా ఉండటానికి, అందంగా కనిపించడానికి మనం ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అయితే.. కడుపు ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా దాదాపు సగం అనారోగ్య సమస్యలకు
Detox Water in Summer: ఆరోగ్యంగా ఉండటానికి, అందంగా కనిపించడానికి మనం ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అయితే.. కడుపు ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా దాదాపు సగం అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే వేసవిలో మనల్ని మనం డిటాక్స్‌గా (మన శరీర నుంచి విషాన్ని తొలగించటం) ఉంచుకోవడం చాలా ముఖ్యం. తద్వారా మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. దీని కోసం మనం ఎలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని హోం రెమెడీస్‌తో మనం శరీరాన్ని చాలా సులభంగా డిటాక్స్ చేసుకోవచ్చు. డిటాక్స్ నీరు తాగడం ద్వారా మన పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అదే సమయంలో బరువు తగ్గడంతోపాటు చర్మం సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇంకా జీర్ణ, బీపీ లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి. కావున ఈ డిటాక్స్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
డిటాక్స్ వాటర్ తయారీకి కావలసిన పదార్థాలు:
కీర దోసకాయ – 10 ముక్కలు – నిమ్మకాయ – 10 ముక్కలు – కొన్ని పుదీనా ఆకులు – తగినంత నీరు
డిటాక్స్ నీటిని ఎలా తయారు చేయాలంటే..?
- ఒక గిన్నెలో కొన్ని కీర దోసకాయ ముక్కలను వేయాలి. దానిలో నిమ్మకాయ ముక్కలను కలపాలి. ఆ తర్వాత పుదీనా ఆకులు వేసి కొద్దిగా నిమ్మరసం వేయాలి. అనంతరం నీళ్లు పోసి బాగా కలపాలి.
- అనంతరం ఈ గిన్నెను ఫ్రిజ్‌లో ఉంచండి. నీరు కొంచెం చల్లగా మారిన తర్వాత తాగండి.. ఇలా రోజంతా తాగినా మంచిదే. ఎందుకంటే.. వేసవిలో ఈ నీరు శరీరం చల్లబడేలా చేస్తుంది.
నిమ్మకాయ, పుదీనా, దోసకాయ వల్ల కలిగే ప్రయోజనాలు..
- నిమ్మకాయ మీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది, తద్వారా మీ శరీరాన్ని అనేక ఆరోగ్య రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుంది.
- పుదీనా జీర్ణక్రియకు మంచిది, ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది.
- పుదీనా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
- దోసకాయలో 96% నీరు ఉంటుంది. కావున ఇది హైడ్రేట్‌గా ఉంచుతుంది.
- దోసకాయ టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. మీ ప్రేగులను శుభ్రపరుస్తుంది.. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
- దోసకాయలో ఆరోగ్యకరమైన జీర్ణ ఎంజైమ్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఉదర సమస్యలను నివారిస్తాయి.
(ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. TV9 తెలుగు వీటిని ధృవీకరించడంలేదు. వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)
Also Read: