Depression : డిప్రెషన్ వల్ల మీ ఏజ్ మరో 10 ఏళ్లు పెరిగి వృద్ధాప్యం రావడం ఖాయం…
ఏ మనిషికైనా డిప్రెషన్ అనేది వారిని కుంగ తీయడానికి కారణం అవుతుంది. డిప్రెషన్ కు అనేక కారణాలు ఉండవచ్చు. కానీ డిప్రెషన్ వల్ల మనిషి శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏ మనిషికైనా డిప్రెషన్ అనేది వారిని కుంగ తీయడానికి కారణం అవుతుంది. డిప్రెషన్ కు అనేక కారణాలు ఉండవచ్చు. కానీ డిప్రెషన్ వల్ల మనిషి శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డిప్రెషన్ వాళ్ళ వయసు కూడా త్వరగా పెరిగి వృద్ధాప్యం వస్తుందని ప్రముఖ డాక్టర్లు సైతం చెబుతున్నారు. ప్రధానంగా డిప్రెషన్ వల్ల శరీరంలో ఒత్తిడిని పెంచే హార్మోన్లు విడుదల అవుతాయని అవి అధిక రక్తపోటు అలాగే డయాబెటిస్ పెరగడం వంటి ప్రమాదాలకు దారితీస్తాయని అందుకే డిప్రెషన్ కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా డిప్రెషన్ మెదడు అకాల వృద్ధాప్యానికి కారణమవుతుందని ఒక అధ్యయనం పేర్కొంది. డిప్రెషన్ లేదా యాంగ్జయిటీ ఉన్నవారిలో వయసు పెరిగే కొద్దీ డిమెన్షియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు గతంలోనే నివేదించారని పరిశోధకులు తెలిపారు. సైకలాజికల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం, మెదడు పనితీరు క్షీణతపై డిప్రెషన్ ప్రభావం గురించి అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది.
UKలోని సస్సెక్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు 34 అధ్యయనాలను సమీక్షించారు. ఈ సమయంలో వారి ప్రధాన దృష్టి నిరాశ లేదా ఆందోళన కారణంగా కాలక్రమేణా మెదడు పనితీరులో క్షీణతకు మధ్య సంబంధం ఉందని పేర్కొన్నారు. పెద్దలలో జ్ఞాపకశక్తి సామర్థ్యం, నిర్ణయం తీసుకోవడం మొదలైన వాటితో సహా మెదడు పనితీరులో లోటును పరిశోధకులు కనుగొన్నారు. సస్సెక్స్ విశ్వవిద్యాలయానికి చెందిన దర్యా గిసినా మాట్లాడుతూ పెరుగుతున్న పని ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా చాలా మందిలో రాబోయే ముప్పై సంవత్సరాలలో మెదడు పనితీరు తగ్గడం, డిమెన్షియా ఉన్నవారి సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.




డిప్రెషన్ కు దూరంగా ఉండాలంటే అనేక లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా యోగ ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలి. యోగా ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా డిప్రెషన్ దూరమై మీరు మనస్సు ఎప్పటికీ యవ్వనంగా ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. డిప్రెషన్ వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుందని ఆ హార్మోన్ ఫలితంగా గుండెపోటు వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
అలాగే డిప్రెషన్ దూరంగా ఉండాలంటే ఎక్కువగా సన్నిహితులతోనూ ఆప్తులతోనూ తమ బాధలను పంచుకోవాలని అలాగే మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఒత్తిడిని దూరం చేసుకోవాలని కొంతమంది మాదకద్రవ్యాలు అలాగే మద్యం సేవిస్తుంటారని ఈ అలవాట్ల వల్ల మరింత శరీరం ఇబ్బంది పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



