AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flu Vaccine: వేగంగా వ్యాపిస్తున్న ఇన్ ఫ్లూయెంజా.. గర్భిణీ స్త్రీలు టీకాను తీసుకునే విషయంలో నిపుణుల సలహా ఏమిటంటే..

గర్భధారణ సమయంలో మహిళల్లో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఇది నేరుగా గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదని డాక్టర్ షా చెప్పారు. గర్భిణీ స్త్రీ  గర్భస్థ శిశువుకి 6 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉంటే..

Flu Vaccine: వేగంగా వ్యాపిస్తున్న ఇన్ ఫ్లూయెంజా.. గర్భిణీ స్త్రీలు టీకాను తీసుకునే విషయంలో నిపుణుల సలహా ఏమిటంటే..
Pregnant Women Vaccine
Surya Kala
|

Updated on: Mar 28, 2023 | 12:09 PM

Share

మన దేశంలో ఓ వైపు ఇన్‌ఫ్లుఎంజా వైరస్ (ఫ్లూ) కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. మరోవైపు ఈ వైరస్ బారిన పడిన రోగులు కూడా మరణిస్తున్నారు. ఇన్ ఫ్లూయెంజా వల్ల గర్భిణులు, పిల్లలు, వృద్ధులకు ముప్పు ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు . ఈ వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఫ్లూ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ టీకాను ఉపయోగించడం ద్వారా, ఇన్ఫ్లుఎంజా నుండి రక్షణ లభిస్తుంది. అయితే గర్భిణీ స్త్రీలు కూడా ఈ టీకాను తీసుకోవచ్చా అనే విషయంపై నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు చెబుతున్నారు. మరి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

ఈ సీజన్ లో ఇన్ ఫ్లూయెంజా వైరస్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ అరుణ్ షా చెబుతున్నారు. చిన్న పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భధారణ సమయంలో మహిళల్లో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఇది నేరుగా గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదని డాక్టర్ షా చెప్పారు. గర్భిణీ స్త్రీ  గర్భస్థ శిశువుకి 6 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉంటే..  ఎవరైనా ఫ్లూ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు అని పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలు ఈ టీకా తీసుకుంటే.. ఇన్ఫెక్షన్ నుండి చాలా రక్షణ ఉంటుంది. అంతేకాదు గర్భంలో పెరుగుతున్న శిశువులు కూడా సురక్షితంగా ఉంటారు. అయితే, మహిళలు ఈ టీకా తీసుకునే ముందు తప్పకుండా డాక్టరును సంప్రదించాలని సూచించారు. వైద్యుని సలహా తర్వాత మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు.

ఇన్ ఫ్లూయెంజా కేసులు ఎంతకాలంలో తగ్గుతాయంటే?  AIIMS న్యూఢిల్లీలోని క్రిటికల్ కేర్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ యుధ్వీర్ సింగ్.. ఇన్ ఫ్లూయెంజా కేసుల తగ్గుదలపై మాట్లాడుతూ..  ఉష్ణోగ్రత తగ్గే వరకు ఈ వైరస్ వ్యాప్తి తగ్గదని పేర్కొన్నారు. దీంతో ఫ్లూ కేసులు కొన్ని వారాల తర్వాత మాత్రమే కేసులు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. గర్భణీలు మాత్రమే కాదు.. ఎవరైనా సరే వైద్యులను సంప్రదించిన తర్వాతే ఫ్లూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. ఈ వ్యాక్సిన్‌లో ప్రతి సంవత్సరం వైరస్ కు అనుగుణంగా మార్పులు ఉంటాయి. కనుక ఈ వ్యాక్సిన్‌ను ప్రతి సంవత్సరం తీసుకోవచ్చు అని పేర్కొన్నారు.

మాస్క్ తప్పనిసరి ప్రస్తుతం ఇన్‌ఫ్లుఎంజాతో పాటు కోవిడ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయని డాక్టర్ సింగ్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. మాస్క్ అన్ని రకాల వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. సంక్రమణను నివారిస్తుంది. వైరస్ బారిన పడే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..