Swimming Benefits: స్విమ్మింగ్ తో బోలెడన్ని లాభాలు.. ఆ అనారోగ్యాలన్నింటికి చెక్ పెట్టవచ్చు!!

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో అందరూ ఆరోగ్యంగా ఉండడంపై ఫోకస్ పెట్టారు. అయితే బిజీ లైఫ్ కారణంగా హెల్దీ లైఫ్ పై దృష్టి పెట్టలేక పోతున్నారు.  చాలా మంది ఇప్పుడు అధిక బరువుతో బాధపడుతున్నారు. దీంతో సన్నబడాలని డైట్ ని మెయిన్ టైన్ చేస్తున్నారు.. వ్యాయామాలు కూడా చేస్తున్నారు.. డాక్టర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. అయితే మనం రోజూ చేసే వ్యాయామాలు, డైట్ ఫుడ్ కంటే స్విమ్మింగ్ చేయడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయన్న విషయం మీకు..

Swimming Benefits: స్విమ్మింగ్ తో బోలెడన్ని లాభాలు.. ఆ అనారోగ్యాలన్నింటికి చెక్ పెట్టవచ్చు!!
Swimming
Follow us
Chinni Enni

|

Updated on: Sep 01, 2023 | 3:14 PM

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో అందరూ ఆరోగ్యంగా ఉండడంపై ఫోకస్ పెట్టారు. అయితే బిజీ లైఫ్ కారణంగా హెల్దీ లైఫ్ పై దృష్టి పెట్టలేక పోతున్నారు.  దీంతో అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే కొంతమంది సన్నబడాలని డైట్ ని మెయిన్ టైన్ చేస్తున్నారు.. వ్యాయామాలు కూడా చేస్తున్నారు.. డాక్టర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. అయితే మనం రోజూ చేసే వ్యాయామాలు, డైట్ ఫుడ్ కంటే స్విమ్మింగ్ చేయడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయన్న విషయం మీకు తెలుసా? నిజమే.. స్విమ్మింగ్ చేయడం వల్ల క్యాలరీలు ఖర్చవడం మాత్రమే కాదు.. బాడీ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటికి దూరమవుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్విమ్మింగ్ చేస్తే బాడీ కూల్ అవుతుంది కూడా. ఒక గంట పాటు స్విమ్మింగ్ చేస్తే 400 క్యాలరీలు ఖర్చువతాయని నిపుణులు చెబుతున్నారు. స్విమ్మింగ్ చేస్తే ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరం అంతటికీ వ్యాయామం అందుతుంది:

రోజూ స్విమ్మింగ్ చేయడం వల్ల శరీరం అంతటికీ వ్యాయామం అందినట్లు అవుతుంది. కార్డియో మోతాడు సునాయాసంగా అందుతుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గుతారు:

స్విమ్మింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారు. శరీరంలోని అన్ని కండరాలు సమర్థవంతంగా పని చేయడం వల్ల క్యాలరీస్ ఎక్కువగా ఖర్చు అవుతాయి. దీంతో బాడీలోని అదనపు కొవ్వు కరుగుతుంది.

గుండె ఆరోగ్యంగా ఉంటుంది:

తరచూ స్విమ్మింగ్ చేయడం వల్ల గుండె కండరాలు బలంగా తయారవుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగు పడుతుంది:

రోజూ స్మిమ్మింగ్ చేస్తే ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగు పడుతుంది. శ్వాసకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి.

యంగ్ గా కనిపిస్తారు:

తరచూ స్విమ్మింగ్ చేయడం వల్ల యంగ్ గా కనిపిస్తారు. ఈత కొడుతూ ఉంటే శరీరంలోని అన్ని కండరాలు, భాగాలు బాగా పని చేస్తాయి. దీంతో బాడీకి ఒక లాంటి మెరుపు వస్తుంది.

బీపీ-షుగర్ సమస్యలు దరిచేరవు:

ఈత కొట్టడంతో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు తగ్గి అనారోగ్య సమస్యలు సోకకుండా ఆరోగ్యంగా, హెల్దీగా ఉంటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి