Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits: రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని తాగితే అద్భుత ప్రయోజనాలు..!

Health Benefits: ప్రస్తుత జీవనశైలి కారణంగా మనుషుల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడున్న కాలంలో వివిధ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ ప్రపంచ వ్యాప్తంగా..

Health Benefits: రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని తాగితే అద్భుత ప్రయోజనాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 16, 2021 | 6:13 PM

Health Benefits: ప్రస్తుత జీవనశైలి కారణంగా మనుషుల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడున్న కాలంలో వివిధ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా డయాబెటిస్‌ అందరిని వెంటాడుతోంది. ఈ వ్యాధి పూర్తిగా నయం అయ్యేందుకు ఎలాంటి చికిత్స లేకపోయినా.. అదపులో పెట్టుకునేందుకు మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాధికి యుర్వేదంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆయుర్వేద సిద్ధాంతాల ప్రకారం.. డయాబెటిస్‌ టైప్‌ -1, టైప్‌ -2 చాలా మందిని వెంటాడుతోంది. కుటుంబ పరంగా, మానసిక ఆందోళన, టెన్షన్‌, ఒత్తిడి ఇలా రకరకాల కారణాల వల్ల డయాబెటిస్‌ వస్తుంటుంది. దీనికి ఆయుర్వేదంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి.

ఇక పూర్వకాలంలో నుండి రాగి చెంబులో నీళ్ళు తాగటం చాలా మందికి అలవాటుగా వస్తుంది. ఇప్పుడున్న టెక్నాలజీ, అధునిక పోకడల కారణంగా కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. రోజు రాగి పాత్రలో నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్లు ఇప్పటికి కొందరు ఆ నీటిని తాగుతుంటారు. రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని ఉదయం లేవగానే తాగితే రోగాలు మటుమాయం అవుతాయని ఆయుర్వేదం చెబుతోంది.

క్యాన్సర్‌ సమస్య తగ్గిస్తుంది..? రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల క్యాన్సర్‌ సమస్యను తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. రాగి పాత్రలో ఉండే నీటిలో యాంటి ఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌‌‌కు దారితీసే కణాలతో పోరాడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల థైరాయిడ్ సమస్య రాకుండా చేసుకోవచ్చు. అలాగే థైరాయిడ్‌ను మెరుగుపర్చడంలో మంచి ఉపయోగం ఉంటుంది.

ఇన్ఫక్షన్ల నుంచి రక్షణ: రాగి పాత్రలో నిల్వ ఉన్న నీరు తాగితే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోవచ్చు. కడుపులో ఏర్పడిన పుండ్లను నయం చేస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యతో బాధపడే వాళ్ళు రాగిపాత్రలో నీళ్లు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఈ నీరు తాగడం వల్ల శరీరంలోని హానికారక బ్యాక్టీరియాలు నాశనం కావడంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

వ్యవర్థాలను బయటకు పంపిస్తుంది: రాగి పాత్రలో నీరు వల్ల శరీరానికి అవసరం లేని వ్యర్థాలను బయటకు పంపి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. వేగంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే మంచిది. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది.

బ్యాక్టీరియాను తరిమేస్తుంది.. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల శరీరంలో ఉండే బ్యాక్టీరియాను సైతం తరిమేస్తుంది. డయేరియా, జాండీస్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా రాగి పాత్రల్లో నీళ్లు అడ్డుకుంటాయని ఆయుర్వేదం చెబుతోంది.

రక్తపోటు నియంత్రణలో.. రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. తద్వారా గుండె సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. రాగి పాత్రల్లో నీళ్లు తాగడం వల్ల నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎముకలు కూడా ధృడంగా ఉంటాయి.

డయాబెటిస్‌కు మరి కొన్ని చిట్కాలు

ఆహారపదార్థాలలో పసుపు.. మనం తినే ఆహారంలో పసుపు ఎక్కువగా చేర్చినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. పసుపుతో పాటుగా ఆవాలు, ఇంగువ, కొత్తిమీర మొదలైనవి కూడా ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కరివేపాకు పొడిని ప్రతి రోజూ అన్నంలో వేసుకొని తినటం వల్ల డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.

ఆహారంలో మెంతులు.. ప్రతి రోజూ ఆహారంలో మెంతులను చేర్చుకోవడం వల్ల డయాబెటిస్‌ ఉన్నవారికి మంచి ఫలితం ఉంటుంది. మెంతులతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే నిద్రలేవగానే మెంతి మొలకలను తినడం, మెంతి గింజలను నానబెట్టి నీటిని తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.

కాకరకాయ, ఉసిరి తినడం: మధుమేహం ఉన్నవారు కాకరకాయ, ఉసిరి, అలోవేరా వంటిటి తినడం వల్ల కూడా డయాబెటిస్‌ రోగులకు అద్భుతమైన ఉపయోగం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Thyroid Disease: మహిళలకు థైరాయిడ్‌ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

Air Pollutione Effect: కాలుష్యం ఊపిరితిత్తులకే కాదు.. కళ్లకు కూడా హానికరం.. వైద్య నిపుణుల వెల్లడి..!