జ్వరం వచ్చినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
జ్వరం వచ్చినప్పుడు శరీరాన్ని సరిగ్గా చూసుకోవడం అవసరం. చల్లటి పదార్థాలు తీసుకోవడం, ఎక్కువ పని చేయడం, వైద్యుల సలహా లేకుండా మందులు వాడడం మంచిది కాదు. చల్లటి నీటితో స్నానం చేయడం లేదా ఐస్ క్రీమ్ తినడం శరీర ఉష్ణోగ్రతను తగ్గించి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.

చలి గాలులు, మారుతున్న వాతావరణం కారణంగా జ్వరం రావడం సాధారణమే. అయితే జ్వరం సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే మీరు త్వరగా కోలుకోవడం కష్టం. శరీరానికి తగిన శ్రద్ధ తీసుకోవడం ద్వారా మాత్రమే జ్వరాన్ని నియంత్రించవచ్చు. కానీ జ్వరం వచ్చినప్పుడు కొన్ని విషయాల్లో తప్పులు చేస్తే అది శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జ్వరం సమయంలో ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్వరం వచ్చినప్పుడు చల్లటి నీటితో స్నానం చేయడం, ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్ వంటి చల్లని పదార్థాలను తినడం చాలా ప్రమాదకరం. ఇది శరీర ఉష్ణోగ్రతను అకస్మాత్తుగా తగ్గించి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరానికి సున్నితమైన ఆహారం, గోరువెచ్చని నీళ్లు లేదా సూప్ వంటి పదార్థాలు తినడం మంచిదని సూచిస్తున్నారు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా కూడా శరీర ఉష్ణోగ్రత నియంత్రణ జరుగుతుంది.
జ్వరం సమయంలో ఎక్కువ పని చేయడం వల్ల శరీరం ఇన్‌ఫెక్షన్‌పై పోరాడే శక్తిని కోల్పోతుంది. ఆఫీసు పని లేదా ఇంటి పని చేయడం వల్ల శరీరం పూర్తిగా అలసిపోతుంది. శరీరానికి అవసరమైన విశ్రాంతి తీసుకోకపోతే జ్వరం తీవ్రమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జ్వరం వచ్చినప్పుడు విశ్రాంతిగా ఉండి తగినంత నిద్ర తీసుకోవడం చాలా ముఖ్యం. విశ్రాంతి తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి బలపడుతుంది.
జ్వరం వచ్చిన వెంటనే వైద్యుల సలహా తీసుకోకుండా సొంతంగా మందులు వేసుకోవడం చాలా ప్రమాదకరమైన విషయం. వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం వల్ల జ్వరానికి కారణం గమనించడం కష్టమవుతుంది. అలాగే కొన్ని మందులు తీసుకోవడం వల్ల అనుకోని దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది. వైద్యుల సలహా తీసుకోకుండా ఫార్మసీ నుంచి ఏ మందులు వాడరాదు.
జ్వరం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే.. రోజులో కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. ఎక్కువ నీటిని తాగడం ద్వారా డీహైడ్రేషన్‌ని నివారించవచ్చు. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం. డాక్టర్ సూచించిన మందులను టైమ్ ప్రకారం వేసుకోండి. జ్వరాన్ని చిన్న సమస్యగా భావించకూడదు. సరైన ఆహారం, విశ్రాంతి, వైద్యుల సలహాతోనే జ్వరాన్ని సమర్థవంతంగా నియంత్రించగలరు.




