Black Fungus: బ్లాక్ ఫంగస్ రీసర్చ్‌లో షాకింగ్ రిపోర్ట్.. కారణాలను వెల్లడించిన పరిశోధకులు
కోవిడ్ 19పై రోజుకో కొత్త వార్త ప్రజలను భయపెడుతోంది. కొవిడ్ బారిన పడిన వారిలో ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్లు వాడటం వల్లే మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) తీవ్రరూపం దాల్చుతోంది. పోస్ట్ కోవిడ్ రోగులలో అవాస్కులర్ నెక్రోసిస్ వికలాంగుల స్థితికి తీసుకెళ్తుందని...
కోవిడ్ 19పై రోజుకో కొత్త వార్త ప్రజలను భయపెడుతోంది. దేశంలో కరోనా కేసులు తగ్గుతుండటంతోపాటు కోలుకుంటున్నవారి సంఖ్య రోజు రోజుకు పెగుతోంది. అయితే ఇదే సమయంలో కొత్త వ్యాధులు వెంటాడుతున్నాయి. మొదట్లో ఇది బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్)అని పిలిచేవారు. అయితే వ్యాధి సోకిన శరీర భాగంలో రక్త ప్రవాహం నిలిచోపోతుంది. అంతే కాకుండా వ్యాధి సోకిన బాధితుల్లో ఎముక కరగడం మొదలవుతుంది. అందుకే దీనికి బోన్ డెత్ అని అంటున్నారు.
కొవిడ్ బారిన పడిన వారిలో ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్లు వాడటం వల్లే మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) తీవ్రరూపం దాల్చుతోంది. పోస్ట్ కోవిడ్ రోగులలో అవాస్కులర్ నెక్రోసిస్ వికలాంగుల స్థితికి తీసుకెళ్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక నివేదికలో తెలిపింది. ముంబైలోని హిందూజా హాస్పిటల్‌లో కోవిడ్ 19 చికిత్స పొందిన నలభై ఏళ్లలోపు ఉన్న ముగ్గురు యువకులకు రెండు నెలల తర్వాత అవాస్కులర్ నెక్రోసిస్ సోకిందని తెలిపింది. బాధితుల్లో తొడ ఎముక భాగంలో ఇది కనిపించినట్లుగా హిందూజా హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. అయితే తమ వైద్యులు మొదటి దశలోనే గుర్తించి వారికి చికిత్స అందించారని తెలిపారు.
కోవిడ్ సెకెండ్ వేవ్ సమయంలో మోతాదుకు మించి స్టెరాయిడ్లను వాడటం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. అటు కొవిడ్ వల్ల, ఇటు స్టెరాయిడ్స్ వాడటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గింది. ఈ కారణంగా బ్లాక్ ఫంగస్ దాడి పెరిగింది. కొందరిలో ఐరన్, జీవక్రియలోనూ తేడాలొచ్చాయి ఇలాంటి పలు కారణాల వల్ల బ్లాక్ ఫంగస్ విజృంభించింది. మ్యూకర్ మైకోసిస్, అవాస్కులర్ నెక్రోసిస్ మధ్య సాధారణ కారకం స్టెరాయిడ్ల వాడకం అని తేల్చారు. ఇదే సమస్యపై డాక్టర్ అగర్వాల్ ఓ పరిశోధనా పత్రంను విడుదల చేశారు. ప్రతిష్టాత్మక వైద్య పత్రిక ‘BMJ కేస్ స్టడీస్’ లో శనివారం ప్రచురించబడింది. ఇందులో ‘లాంగ్ కోవిడ్ 19 లో భాగంగా అవాస్కులర్ నెక్రోసిస్’ పేరుతో వచ్చిన వ్యాసంలో చాలాం అంశాలను ఆయన టచ్ చేశారు. బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందడానికి స్టెరాయిడ్లను అధికంగా వాడటం వల్లే ఇలా జరిగిందని తెలిపారు.