CoWIN Global Conclave: “వన్ ఎర్త్, వన్ హెల్త్” మేము నమ్ముతాం.. ఇప్పుడు ప్రపంచం విశ్వసిస్తోందన్న ప్రధాని

"వన్ ఎర్త్, వన్ హెల్త్" ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న విధానాన్ని భారతీయులు గట్టిగా విశ్వసిస్తారని.. కరోనా వైరస్ తర్వాత చాలా మంది విదేశీయులు కూడా ప్రస్తుతం ఈ సూత్రాన్ని బలంగా విశ్వసిస్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

CoWIN Global Conclave: వన్ ఎర్త్, వన్ హెల్త్ మేము నమ్ముతాం.. ఇప్పుడు ప్రపంచం విశ్వసిస్తోందన్న ప్రధాని
Cowin Global Conclave Pm Mo
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 05, 2021 | 4:59 PM

కోవిడ్ నుంచి బయటపడడానికి ‘వ్యాక్సినేషన్’ ఒక్కటే మార్గమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై ముందు నుంచి తాము  డిజిటల్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సోమవారం ‘కొవిన్ అంతర్జాతీయ సదస్సు’ జరిగింది. దీనిలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టేందుకు భారత్ వినియోగిస్తున్న డిజిటల్ వేదికే కొవిన్. కోవిడ్‌పై పోరులో భాగంగా ఈ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను దాదాపు 50 దేశాలకు ఉచితంగా అందించేందుకు భారత్ సిద్ధమైంది. దేశ విదేశాలకు చెందిన ఆరోగ్య రంగ నిపుణులు ఈ సదస్సులో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ… “వన్ ఎర్త్, వన్ హెల్త్” ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న విధానాన్ని భారతీయులు గట్టిగా విశ్వసిస్తారని.. కరోనా వైరస్ తర్వాత చాలా మంది విదేశీయులు కూడా ప్రస్తుతం ఈ సూత్రాన్ని బలంగా విశ్వసిస్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అందుకే కొవిన్ టెక్నాలజీని విశ్వవ్యాపితం చేయడానికి ఓపెన్ సోర్స్‌గా ఉంచినట్లు ప్రధాని  తెలిపారు. కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సాంకేతికత అంతర్గతంగా చాలా పాత్ర పోషించిందన్నారు. టెక్నాలజీలోని వనరులను వాడుకోవడానికి ఓ పరిమితి అంటూ లేదని.. ఈ అంశం బాగా కలిసొచ్చిందని అన్నారు. అందుకే కోవిడ్ ట్రేసింగ్, ట్రాకింగ్ యాప్‌ను ఓపెన్ సోర్స్ చేసేశామని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నాని అన్నారు. వందేళ్లలో ఇంత పెద్ద మహమ్మారి ఏదీ లేదని, కరోనాకు దేశ, విదేశం అన్న తేడా లేదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదండి : Congress politics: కాంగ్రెస్‌లో ముదురుతున్న ముసలం.. మాజీ సీఎం ప్రకటనకు తాజాగా పీసీసీ చీఫ్ కౌంటర్..

Krishna Water: కృష్ణా జలాల వివాదంపై దాఖలైన పిటీషన్.. రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..