Tribal Sisters: అమానుషం.. ఫోన్‌లో మాట్లాడుతున్నారాని అక్కాచెల్లెళ్లను కర్రలతో చితకబాదిన కుటుంబ సభ్యులు.
Tribal Sisters: సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలను చూస్తుంటే ఒళ్లు గగుర్లు పొడుస్తోంది. మనుషులు ఇలా ఉంటారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందన్న కారణంతో సొంత చెల్లినే తోబుట్టువులు..
Tribal Sisters: సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలను చూస్తుంటే ఒళ్లు గగుర్లు పొడుస్తోంది. మనుషులు ఇలా ఉంటారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందన్న కారణంతో సొంత చెల్లినే తోబుట్టువులు చెట్టుకు కట్టేసి కొట్టిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ఒక్కసారి యావత్ దేశాన్ని కలిచివేసింది. ఇదిలా ఉంటే ఈ సంఘటన మరిచిపోకముందే అదే మధ్యప్రదేశ్‌లో మరో ఘోరం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మనిషిలోని మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లా పిపల్వ గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన యువతులు మేనమామ కుమారులతో ఫోన్‌లో మాట్లాడారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన కుటుంబ సభ్యులు ఆ ఇద్దరు అమ్మాయిలను అత్యంత దారుణంగా కర్రలతో చితకబాదారు. అంతటితో ఆగకుండా దానతంటినీ వీడియోలో చిత్రీకరించారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూన్ 22న జరిగిన ఈ ఘటన జాతాగా వెలుగులోకి వచ్చింది. దీంతో 19, 20 ఏళ్ల వయసున్న ఆ బాధితురాళ్లను తాండా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీసులు విచారణ చేపట్టారు. వారి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకున్నారు. యువతులపై దాడికి దిగిన మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉండడం గమనార్హం. ఇక సొంత కుటుంబ సభ్యులే జుట్టు పట్టుకొని ఈడుస్తూ, కర్రలతో దాడి చేసిన తీరును చూసిన నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.
Also Read: Kadapa Crime News: అడ్డెడ్డె, బంగారం ఇంత చవకా..? ఆశపడి కొన్నారో కొంప కొల్లేరే