జమ్మూలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్ల దాడి ఘటన.. పవర్ ఫుల్ ఆర్ డీ ఎక్స్ వాడినట్టు నిర్ధారించిన ఫోరెన్సిక్ నివేదిక
జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై ఇటీవల జరిగిన డ్రోన్ల దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఎటాక్ లో ఇద్దరు వైమానిక దళ ఉద్యోగులు గాయపడ్డారు. డ్రోన్ల నుంచి జారి పడిన పేలుడు పదార్థాల్లో ఆర్ డీ ఎక్స్, నైట్రేట్ మిశ్రమంతో కూడిన బాంబులు ఉన్నట్టు ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది.
జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై ఇటీవల జరిగిన డ్రోన్ల దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఎటాక్ లో ఇద్దరు వైమానిక దళ ఉద్యోగులు గాయపడ్డారు. డ్రోన్ల నుంచి జారి పడిన పేలుడు పదార్థాల్లో ఆర్ డీ ఎక్స్, నైట్రేట్ మిశ్రమంతో కూడిన బాంబులు ఉన్నట్టు ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది. ఈ రెండింటిలో ఒకటి పెద్దదిగా ఉందని, ఇది ఈ స్టేషన్ లోని వ్యవస్థలను నాశనం చేయడానికి, మరొకటి ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని టార్గెట్ చేయడానికి ఉద్దేశించినదని నిపుణులు తెలిపారు. పాకిస్థాన్ ఉగ్రవాదులే ఇందుకు పాల్పడి ఉంటారని ఇప్పటికీ అనుమానిస్తున్నారు. అయితే ఆ దేశం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం గమనార్హం. ఓ డ్రోన్ పై ‘మేడిన్’ చైనా’ అని ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఈ డ్రోన్ల దాడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతోంది. జమ్మూ ఎయిర్ పోర్టు నుంచి అంతర్జాతీయ సరిహద్దు సుమారు 14 కి.మీ. దూరంలో ఉంది. అయితే ఇది వైమానిక (ఏరియల్) దూరమని ఈ సంస్థ సిబ్బంది వెల్లడించారు.
ఈ డ్రోన్ల దాడులు కీలక సైనిక స్థావరాలను టార్గెట్ గా చేసుకున్నవేనని..వీటి సామర్థ్యాన్ని, ప్రభావాన్ని ఇంకా అంచనా వేస్తున్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ భదురియా తెలిపారు. ఇది టెర్రరిస్టుల పనేనని అనుమానిస్తున్నామని.. వారి యత్నం విఫలమైందని ఆయన చెప్పారు. రెండు బాంబులు వాడినా డ్యామేజీ కాలేదన్నారు. ఇలా ఉండగా ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో జామర్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:ఆషూ రెడ్డి అడవి పంది అంటూ రచ్చ.. అషూ రెడ్డి వీడియో లీక్ చేసిన యాంకర్ రవి..:anchor ravi on ashu reddy video.