Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ పదార్థాలకు దూరంగా ఉండండి.. తిన్నారో ఇక అంతే సంగతులు..
సాధారణంగా వర్షాకాలంలో అత్యంత ఎక్కువగా వ్యాధుల భారిన పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జ్వరం, ఫ్లూ, ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు అధికంగా బాధిస్తుంటాయి.
సాధారణంగా వర్షాకాలంలో అత్యంత ఎక్కువగా వ్యాధుల భారిన పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జ్వరం, ఫ్లూ, ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు అధికంగా బాధిస్తుంటాయి. మిగతా సీజన్స్ కంటే ఈ వర్షాకాలంలో అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఈ కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ కాలంలో దోమల సమస్య ఎక్కువే. అలాగే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతోపాటు.. నీటిలో మార్పులు జరిగే అవకాశం ఎక్కువే ఉంటుంది. అలాగే వర్షాకాలంలో చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు అధికంగానే వస్తుంటాయి. అయితే ప్రస్తుత కరోనా కాలంలో ప్రతి వ్యాధి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇవి కరోనాతో జతకలిస్తే మరింత ప్రమాధకరం. అయితే ఈ కాలంలో సీజనల్ వ్యాధుల భారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని కూరగాయలను ఈ కాలంలో అస్సలు తినకూడదు. అవెంటో తెలుసుకుందామా.
నూనె వంటలు… వర్షాకాలంలో నూనె ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. సమోసా, బజ్జీలు, పాపడ్ వంటి ఆయిల్ ఫుడ్ ను తీసుకోవడం మానుకోవాలి. ఆయిల్ ఫుడ్ తినడం వలన అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి.
ఆకు కూరలు.. ఈ సీజన్ లో బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆకు కూరలలో గొంగళి పురుగులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఈ వర్షాకాలంలో ఆకు కూరలు తీసుకోవడం వలన కడుపు సమస్యలు, జీర్ణవ్యవస్థపై ప్రభావం ఉంటుంది. ఈ కాలంలో సోరెల్, నారీ, బచ్చలి కూర, మెంతి, పాలకూర, పుట్టగొడుగులు, బ్రోకలీ, కాలీఫ్లవర్, పాలు వంటి కూరగాయలు తినడం మానుకోవాలి.
సలాడ్.. ఈ వర్షాకాలంలో సలాడ్ తీసుకోవడం మానుకోవాలి. ఈ కాలంలో పచ్చి కూరగాయలను తినడం వలన కడుపులో సమస్యలు మొదలవుతుంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే బ్యాక్టిరియా కారణంగా అనారోగ్య సమస్యలకు గురికావాల్సి ఉంటుంది.
చేపలు.. వర్షాకాలంలో చేపులు, రొయ్యలు వంటి సముద్ర ఆహారాన్ని అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ సమయంలో నీరు ఎక్కువగా కలుషితమవుతుంది. ఈ కాలంలో చేపలను తీసుకోవడం వలన ఇన్ఫెక్షన్ల భారిన పడే అవకాశం ఉంటుంది.
Ram Charan: చరణ్ సినిమాకు శంకర్ లైన్ క్లియర్ అయ్యిందా ? చెర్రీ న్యూ మూవీ షూటింగ్ అప్డేట్…