Radha: రెండో భర్తపై మరోసారి ఫిర్యాదు చేసిన హీరోయిన్.. చిత్రహింసలు పెడుతూ.. చంపుతానని బెదిరిస్తున్నాడని..

'సుందర ట్రావెల్స్' హీరోయిన్ రాధ తన రెండో భర్తపై మరోసారి ఫిర్యాదు చేసింది. కొద్ది నెలల క్రితం ఎన్నూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‏స్పెక్టర్ వసంత రాజాను రెండో వివాహం చేసుకున్నారు రాధ.

Radha: రెండో భర్తపై మరోసారి ఫిర్యాదు చేసిన హీరోయిన్.. చిత్రహింసలు పెడుతూ.. చంపుతానని బెదిరిస్తున్నాడని..
Radha
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 05, 2021 | 10:29 AM

‘సుందర ట్రావెల్స్’ హీరోయిన్ రాధ తన రెండో భర్తపై మరోసారి ఫిర్యాదు చేసింది. కొద్ది నెలల క్రితం ఎన్నూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‏స్పెక్టర్ వసంత రాజాను రెండో వివాహం చేసుకున్నారు రాధ. ఈ క్రమంలోనే తన భర్త తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని.. చంపుతానని బెదిరిస్తున్నాడని.. గత ఏప్రిల్ నెలలో స్థానిక విరుగంబాక్కం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇద్దరు రాజీ పడి ఆ ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు మరోసారి తన భర్త తనపై అనుమానం పెంచుకుని తీవ్రంగా కొడుతున్నాడని.. అతని పై చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ.. ఆదివారం పరంగిమలైలోని జాయింట్ కమిషనర్ కార్యాలయంలో మరోసారి ఫిర్యాదు చేశారు రాధా.

ఈ క్రమంలో రాధ మాట్లాడుతూ.. తన భర్త అతని స్నేహితులు, బంధువులతో కలిసి తనను తీవ్రంగా హింసిస్తున్నారని.. అతనిపై.. అతని మిత్రులైన సబ్ ఇన్‏స్పెక్టర్ భారతి, ఇళంవరుదిలపై చర్యలు తీసుకోవాలని రాధ పోలీసులను కోరారు. గతంలో కూడా తనపై పెట్టిన కేసును తిరిగి తీసుకోవాలని తన భర్త ఆమెను హింసించడని.. అందుకే ఫిర్యాదు తిరిగి తీసుకున్నానని.. అయిన చిత్రహింసలు తప్పడం లేదంటూ వాపోయింది.  కాగా సుందరా ట్రావెల్స్ , హడావిడి, గేమ్ తదితర చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు రాధ. ఆ తర్వాత ఆమెకు అంతంగా అవకాశాలు రాలేదు. అనంతరం ఆమె ఓ నిర్మాతను వివాహం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థాల కారణంగా ఆమె విడాకులు తీసుకుంది. తన కొడుకుతో కలిసి తల్లి దగ్గర జీవిస్తున్న రాధ.. కొన్ని నెలల క్రితం వసంతా రాజాను రెండో వివాహం చేసుకుంది.

Also Read: Ram Charan: చరణ్ సినిమాకు శంకర్ లైన్ క్లియర్ అయ్యిందా ? చెర్రీ న్యూ మూవీ షూటింగ్ అప్‏డేట్…

Kasthuri Shankar: సోషల్ మీడియాలో ‘గృహలక్ష్మీ’ నటి మరో రచ్చ.. ఏకంగా ముఖ్యమంత్రిపైనే షాకింగ్ కామెంట్స్..

Shahid Kapoor: తెరపైకి మరోసారి విద్యాబాలన్-షాహిద్ కపూర్ లవ్‏స్టోరీ.. ఆ కామెంట్స్ వల్లే విడిపోయారంటూ..

ఆ దర్శకుడికి కోరుకున్నది ఇస్తే లక్ష రూపాయాలిస్తారట.. వెంటనే బిల్డింగ్ మీద నుంచి… షాకింగ్ విషయాలను చెప్పిన హీరోయిన్..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..