Colon Cancer: ఈ ఆహార పదార్థాలతో పెద్దపేగు క్యాన్సర్‌కు చెక్‌.. అధ్యయనంలో కీలక విషయాలు

Colon Cancer: ప్రస్తుతం వ్యాధులు వెంటాడుతున్నాయి. ముందే కరోనా మహమ్మారితో ఇబ్బందులకు గురవుతుంటే.. మరికొన్ని వ్యాధులు జనాలను చుట్టుముట్టేస్తున్నాయి...

Colon Cancer: ఈ ఆహార పదార్థాలతో పెద్దపేగు క్యాన్సర్‌కు చెక్‌.. అధ్యయనంలో కీలక విషయాలు
Follow us

|

Updated on: Mar 13, 2022 | 8:48 PM

Colon Cancer: ప్రస్తుతం వ్యాధులు వెంటాడుతున్నాయి. ముందే కరోనా మహమ్మారితో ఇబ్బందులకు గురవుతుంటే.. మరికొన్ని వ్యాధులు జనాలను చుట్టుముట్టేస్తున్నాయి. ఇక చాలా మందికి క్యాన్సర్‌ సోకుతుంటుంది. రకరకాల క్యాన్సర్లు (Cancer) వస్తుండటంతో మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇక ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారాలను తీసుసుకోవడం వల్ల పొత్తి కడుపు క్యాన్సర్ల బారి నుంచి బయటపడవచ్చని గతంలో పలు అధ్యయనాలు (Studies) వెల్లడించాయి. ఫైబ‌ర్‌తో కూడిన ఆహారం ద్వారా బ్రెస్ట్‌, జ‌న‌నేంద్రియ‌, గ్యాస్ట్రో ఇంటెస్టిన‌ల్ క్యాన్సర్ల ముప్పు గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ని కూడా ఆధారాలు ల‌భించాయి. ఆయా క్యాన్సర్లకు, అధిక ఫైబ‌ర్ ఆహారానికి గ‌ల సంబంధాన్ని మ‌రో అధ్యయ‌నం వెల్లడించింది. ఇటీవల నేష‌న‌ల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌, నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేరీల్యాండ్ (యూఎస్ఏ) ఈ అధ్యయ‌నం చేప‌ట్టాయి.

ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారాలతో..

అయితే దేశ వ్యాప్తంగా అధ్యయనాలతో అంతర్జాతీయ అధ్యయనాల వివరాలను పరిశోధకులు సరిపోల్చారు. పెద్దపేగు క్యాన్సర్‌తో ఫైబర్‌తో కూడిన ఆహారాల సంబంధంపై 1980 నుంచి 32 అధ్యయనాలు నిగ్గుతేల్చాయ‌ని తాజా అధ్యయ‌నం వెల్లడించింది. ఫైబ‌ర్ అధికంగా ఉండే ఆహారం క్యాన్సర్ ముప్పును నివారిస్తుంద‌ని వెల్లడించాయి. అయితే అన్‌ప్రాసెస్డ్ ఫైబ‌ర్‌ను తీసుకోవాల‌ని, మొక్కల ఆధారిత ఆహారమైన కూర‌గాయ‌లు, పండ్లు, తృణ‌ధాన్యాలు ఎక్కువ‌గా తీసుకోవాల‌ని ప‌రిశోధ‌కులు సూచిస్తున్నారు.

బరువు తగ్గించుకోవడం..

కాగా, ఫైబ‌ర్ అధికంగా ఉండే ఆహారంతో మొత్తం మ‌నం తీసుకునే క్యాల‌రీలు త‌గ్గుతాయ‌ని, ఆరోగ్యక‌ర‌మైన బ‌రువు ఉంటూ క్యాన్సర్ ముప్పును నివారించుకోవ‌చ్చని పోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ ఓఖ్లాకు చెందిన డాక్టర్ సంజ‌య్ వ‌ర్మ పేర్కొన్నారు.

ఫైబ‌ర్‌తో కూడిన ఆహారం అధికంగా తీసుకుంటే శ‌రీరంలో కొవ్వు క‌రిగి జీవక్రియ సాఫీగా సాగుతుంద‌ని వెల్లడించారు. ఫైబ‌ర్ అధికంగా ఉండే ఓట్స్‌, బార్లీ, తృణ‌ధాన్యాలు, వేరుశ‌న‌గ‌, అవ‌కాడో, ఆరంజ్‌, యాపిల్‌, స్ప్రౌట్స్ వంటి ఆహారం ఎక్కువ‌గా తీసుకోవాల‌ని ప‌రిశోధ‌కులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Colorectal Cancer: పురుషులకు ఎక్కువగా వచ్చే కాన్సర్ ఇదే.. జీవనశైలి మార్పుల కారణంగా ప్రమాదం ఎక్కువ

Migraine: మైగ్రేన్ సమస్య ఉన్నవారు ఈ పదార్థాలను అస్సలు తినకూడదు.. మర్చిపోతే మరింత ఎఫెక్ట్..

Latest Articles
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… తక్కువ వడ్డీకే రుణాలు
వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… తక్కువ వడ్డీకే రుణాలు
పెరుగుతో బెల్లం కలిపి తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..?
పెరుగుతో బెల్లం కలిపి తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..?
తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత పోస్ట్
తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత పోస్ట్
కీలక నిర్ణయం.. ఉబెర్‌ నుంచి ట్యాక్సీలే కాదు ఇక బస్సులు కూడా..
కీలక నిర్ణయం.. ఉబెర్‌ నుంచి ట్యాక్సీలే కాదు ఇక బస్సులు కూడా..
ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్‌ ప్రమాదం వెనక ఎవరి హస్తం ఉంది?
ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్‌ ప్రమాదం వెనక ఎవరి హస్తం ఉంది?
శ్రీశైలంలో ఉక్కపోత నుంచి ఉపశమనం.. దంచికొట్టిన వర్షం..
శ్రీశైలంలో ఉక్కపోత నుంచి ఉపశమనం.. దంచికొట్టిన వర్షం..
ఆపద వేళ ఆపన్న హస్తం.. ఆ యాప్ ద్వారా అంబులెన్స్ బుకింగ్స్ షురూ
ఆపద వేళ ఆపన్న హస్తం.. ఆ యాప్ ద్వారా అంబులెన్స్ బుకింగ్స్ షురూ