AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coffee vs Tea: టీ, కాఫీ.. ఈ రెండింటిలో ఏది బెస్ట్.. ఆరోగ్యానికి ఏది ప్రమాదకరమో తెలుసా..

95 శాతం మంది భారతీయులు తమ ఉదయం టీ, కాఫీతో మొదలు పెడతారు. ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే బెడ్ టీ.. సాయంత్రం అలసటను దూరం చేసుకోవాలంటే బాబాయి బండి వద్ద వేడి వేడి చాయ్ తాగిలి.. ఇది మనలో చాలా మంది నిత్యం చేసే పని. కానీ ఇందులో ఏది బెస్ట్ అనేది ఎవరు చెప్పాలి.. ఎవరు నిర్ణయించాలి. లిమిట్ వరకు ఏదైనా మంచిదే.. ఇందులో ఉండే కెఫిన్ మన ఆరోగ్యంపై ప్రభావం చూస్తుందని.. ఇది ఎందులో ఎక్కువగా ఉంటుందో కూడా మనకు తెలిసి ఉండాలి.. అప్పుడే సరైన నిర్ణయం తీసుకుంటాం.. ఈ రెండింటిలో ఏది మంచిది అంటే మాత్రం..

Coffee vs Tea: టీ, కాఫీ.. ఈ రెండింటిలో ఏది బెస్ట్.. ఆరోగ్యానికి ఏది ప్రమాదకరమో తెలుసా..
Coffee Vs Tea
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 17, 2023 | 3:45 PM

మనవారికి చాయ్, కాఫీ లేనిదే రోజు గడవదు. చాలా మంది రోజులో రెండు నుంచి నాలుగు టీ, కాఫీలు లేపేస్తుంటారు. అంతెందుకు.. భారతీయులలో 95 శాతం మంది ఉదయం టీ, కాఫీతో రోజును ప్రారంభిస్తారు. తెల్లవారుజామున కళ్లు తెరిచిన వెంటనే లేదా సాయంత్రం అలసటను దూరం చేసుకోవాలంటే టీ లేదా కాఫీని ఆశ్రయిస్తారు. ఈ రోజు మనం మాట్లాడుకుందాం.. టీ లేదా కాఫీ ఆరోగ్యానికి మేలు చేస్తుందా..? ఈ రెండింటిలో కెఫిన్ మొత్తాన్ని పోల్చినట్లయితే.. నికోటిన్, కాఫీ వంటి కెఫిన్ టీ కంటే చాలా ఎక్కువ. టీని ఫిల్టర్ చేయడం వల్ల అందులో కెఫిన్, నికోటిన్ పరిమాణం తగ్గుతుంది.

కెఫిన్ ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది అనేక రకాల పానీయాలు లేదా పానీయాలలో కనిపిస్తుంది. టీ లేదా కాఫీలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏ సమయంలో తాగుతున్నారు. 400 గ్రాముల కెఫిన్ మనిషికి ఆరోగ్యకరం.. ఇంతకంటే ఎక్కువగా తాగితే అది ఆరోగ్యానికి హానికరం. ఈ చిన్న విషయాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకోండి. ఇది మనసులో పెట్టుకుంటే ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది.

బ్యాడ్ ఫ్యాట్‌ను బర్న్ చేస్తుంది..

అనేక పరిశోధనల ప్రకారం, కెఫీన్ 3-13 శాతం కేలరీలను కలిగి ఉంటుంది. ఇది కొవ్వును కాల్చేస్తుంది. అందువల్ల, మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తున్నట్లయితే.. కాఫీ తాగడం మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

యాంటీఆక్సిడెంట్లు

టీ, కాఫీ రెండూ యాంటీఆక్సిడెంట్లు, ఇవి అనేక రకాల నష్టాల నుంచి మనలను రక్షిస్తాయి. అలాగే, ఇది అనేక వ్యాధుల వ్యాప్తిని నివారిస్తుంది.

శక్తి స్థాయిని పెంచుతాయి

టీలో కెఫిన్ పరిమాణం తక్కువగా ఉంటుంది. ఎల్-థియనైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన మెదడుకు చాలా మంచిది. మీరు టీ తాగితే.. కెఫీన్‌తో పాటు ఎల్-థియానైన్ తాగడం వల్ల మిమ్మల్ని అప్రమత్తంగా, ఏకాగ్రతతో, అలర్ట్‌నెస్‌ను పెంచుతుందని చాలా పరిశోధనలలో తేల్చి చెప్పాయి.

దంతాల మీద అలాంటి ప్రభావం ఉంది

కాఫీ కంటే టీ మీ దంతాలపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది మీ దంతాలను తెలుపు నుంచి పసుపు రంగులోకి మారుస్తుంది.

నిపుణులు ఏమంటారు

నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాఫీ కంటే టీ మంచిదని, ఎందుకంటే ఇందులో కెఫీన్ తక్కువగా ఉంటుంది. రెండింటినీ తయారు చేసే విధానంలో చాలా తేడా ఉంటుంది. మీరు ఈ రెండింటిని ఎక్కువసేపు మరిగించినట్లైతే, యాంటీఆక్సిడెంట్లు ప్రభావితమవుతాయి. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వీటన్నింటితో పాటు, మీరు జోడించే చక్కెర పరిమాణం చాలా తేడాను కలిగిస్తుంది.

టీ లేదా కాఫీ?

టీ లేదా కాఫీ ఏది మంచిది అంటే.. ఇది మీ వ్యక్తిగత ఎంపిక అని చెప్పవచ్చు. కానీ ఈ రెండింటిని అధికంగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా హానికరం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే రెండింటినీ చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఒకటి నుంచి రెండు కప్పుల కాఫీ లేదా ఒకటి నుంచి రెండు కప్పుల టీ తాగడం మంచిది. ఇంతకు మించి తాగితే ఆరోగ్యానికి హానికరం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం