AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొబ్బరినీరు మంచిదే కానీ.. వీరికి మాత్రం డేంజర్! అస్సలు తాగొద్దు

కొబ్బరినీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. వైద్యులు కూడా అనారోగ్యంతో నీరసించిన వారికి కొబ్బరి నీరు తాగాలని సూచిస్తారు. కానీ, కొందరు మాత్రం కొబ్బరి నీరుకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. కొన్ని ప్రత్యేకమైన వ్యాధులతో బాధపడుతున్నవారు కొబ్బరినీరుకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

కొబ్బరినీరు మంచిదే కానీ.. వీరికి మాత్రం డేంజర్! అస్సలు తాగొద్దు
Coconut Water
Rajashekher G
|

Updated on: Jan 04, 2026 | 6:12 PM

Share

కొబ్బరినీరు అనేది సహజమైన సూపర్ ఎనర్జీ డ్రింక్‌గా చెబుతారు. ఆరోగ్యంగా ఉన్నవారైనా, అనారోగ్యంతో ఉన్నవారైనా కొబ్బరి నీరు తాగవచ్చని అంటారు. ఇందులో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. డీహైడ్రేషన్‌ను నివారించడంలో ఇది సహాయపడుతుంది. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కొబ్బరినీరు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతోపాటు జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఇలాంటి అనేక ప్రయోజనాలు ఉన్న కొబ్బరినీటిని కొందరు మాత్రం తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారు కొబ్బరి నీరు తీసుకుంటే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు

కొబ్బరి నీటిలో నీటిలో సహజ చక్కెర ఉంటుంది (200 మి.లీ.కి దాదాపు 6-7 గ్రాములు). ఇది ఇతర శీతల పానీయాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. ఇది మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. అందుకే, డాక్టర్ నిర్దేశించిన విధంగా మాత్రమే తీసుకోవాలి.

మూత్రపిండాల వ్యాధి బాధితులు

మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు ప్రమాదకరమనే చెప్పాలి. ఎందుకంటే.. ఇందులో అధిక స్థాయిలో పొటాషియం ఉంటుంది. మూత్రపిండాలు ఈ పొటాషియాన్ని ఫిల్టర్ చేయలేనప్పుడు.. రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగే ‘హైపర్‌కలేమియా’ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది హృదయ స్పందన రేటులో మార్పులు, కండరాల బలహీనతకు కారణమవుతుంది.

అలెర్జీ సమస్యలు ఉన్న వ్యక్తులు

కొబ్బరి నీరు లేదా కొబ్బరి సంబంధిత ఉత్పత్తులను తినేటప్పుడు అలెర్జీలు ఎదుర్కొనే వ్యక్తులు కొబ్బరి నీళ్ళకు దూరంగా ఉండాలి. వీరు కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల దురద, చర్మంపై ఎర్రటి మచ్చలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఎదుర్కోవచ్చు.

జలుబు, జ్వరం బాధితులు

ఆయుర్వేదం ప్రకారం.. కొబ్బరి నీళ్ళు శరీరాన్ని చల్లబరుస్తాయి. అందువల్ల, జలుబు, దగ్గు లేదా గొంతు నొప్పి ఉన్నసమయంలో కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల కఫం పెరుగుతుంది. దీంతో వారికి వ్యాధి నయం కావడం ఆలస్యం అవుతుంది.

బీపీ బాధితులు

కొబ్బరి నీళ్లలోని పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడినప్పటికీ.. బీపీ మందులు వాడేవారు జాగ్రత్తగా ఉండాలి. బీపీ మాత్రలతో పాటు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో అధిక పొటాషియం స్థాయిలు ఏర్పడతాయి. ఇతర సమస్యలకు దారితీయవచ్చు.

ఎలక్ట్రోలైట్-నిరోధిత ఆహారం పాటించేవారు

వైద్యుల సలహాతో గుండె జబ్బులు లేదా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా పొటాషియం, సోడియం స్థాయిలను నియంత్రణలో ఉంచుకునేవారు కూడా కొబ్బరినీరుకు దూరంగా ఉండాలి. లేదంటే కొబ్బరి నీరు వారి శరీరంలోని లవణాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. వారి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు. అందుకే ఇలాంటి మాత్రం కొబ్బరినీరును వైద్యుల సూచించిన మేరకు తీసుకోవడం లేదా? మానేయడం చేస్తే మంచిది.

టీ తాగితే యంగ్ లుక్.. ఇంకా ఎన్ని లాభాలో తెలుసా..
టీ తాగితే యంగ్ లుక్.. ఇంకా ఎన్ని లాభాలో తెలుసా..
సెల్ఫీ పిచ్చితో రోహిత్ చేయి లాగిన యువకులు.. కట్ చేస్తే..
సెల్ఫీ పిచ్చితో రోహిత్ చేయి లాగిన యువకులు.. కట్ చేస్తే..
ఈసారి సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చింది..? ముహూర్తం,పుణ్యకాలంలోనే
ఈసారి సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చింది..? ముహూర్తం,పుణ్యకాలంలోనే
ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్ చూడాలనుకుంటున్నారా..? టికెట్లు ఇలా బుక్
ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్ చూడాలనుకుంటున్నారా..? టికెట్లు ఇలా బుక్
ఏ టెస్టులు కూడా కనిపెట్టలేదు.. గుండెపోటుతో డాక్టర్ ఆకస్మిక మరణం..
ఏ టెస్టులు కూడా కనిపెట్టలేదు.. గుండెపోటుతో డాక్టర్ ఆకస్మిక మరణం..
ఒక్క ఇన్నింగ్స్‌లోనూ ఔట్ కాని కావ్యా పాప వదిలేసిన వజ్రం
ఒక్క ఇన్నింగ్స్‌లోనూ ఔట్ కాని కావ్యా పాప వదిలేసిన వజ్రం
EMI కట్టలేదని దాన్ని తీసుకెళ్లారు.. ఎన్నో కష్టాలు చూశా..
EMI కట్టలేదని దాన్ని తీసుకెళ్లారు.. ఎన్నో కష్టాలు చూశా..
రాత్రుళ్లు ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్ బెల్స్ మోగినట్టే.!
రాత్రుళ్లు ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్ బెల్స్ మోగినట్టే.!
ఆమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య.. హంతకుడెవరో తెలిస్తే!
ఆమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య.. హంతకుడెవరో తెలిస్తే!
జస్ట్ రూ. 2 లక్షలతో రూ.75 లక్షలు.. ఈ స్టాక్‌‌లతో కాలు కదపకుండా..
జస్ట్ రూ. 2 లక్షలతో రూ.75 లక్షలు.. ఈ స్టాక్‌‌లతో కాలు కదపకుండా..