Child Care: పిల్లలకు ఈ ఫుడ్ తినిపిస్తే అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. అవేంటంటే..!
Child Care: సాధారణంగా, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వారికి ఏం తినిపించాలి, వారు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..
Child Care: సాధారణంగా, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వారికి ఏం తినిపించాలి, వారు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం పెట్టాలని ఆలోచిస్తుంటారు. అయితే, పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే వారు తినే ఆహారం, పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పిల్లల వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది పిల్లలు వాటర్ తాగాలన్నా, ఫుడ్ తినాలంటే మారాం చేస్తుంటారు. దాంతో ఏం చేయాలో అర్థం కాక తల్లిదండ్రులు సతమతం అవుతుంటారు. అయితే, పిల్లలకు పోషకాహారం సమృద్ధిగా లభించే వాటిని తినిపిస్తే.. వారు ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు. పండ్లు తినిపించడం ద్వారా పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. మీ శిశువుకు 6 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే.. కొన్ని ఆరోగ్యకరమైన ఫలాలను తినిపించొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలకు కివిని తినిపించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కివిలో విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని తినడం ద్వారా రక్త హీనతను దూరం చేయడమే కాకుండా, అనేక ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. పిల్లలకు కివి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మలబద్ధకం నుంచి ఉపశమనం.. చాలాసార్లు పిల్లలు మలబద్ధకంతో బాధపడుతుంటారు. మలబద్ధకం పిల్లలకు ఇబ్బంది కలిగిస్తుంది. ఫలితంగా ఆహారం తీసుకోరు. ఇలాంటి పరిస్థితిలో కివి ని వారికి తినిపించాలి. ఇందులో ఉండే ఫైబర్.. జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. క్రమం తప్పకుండా తినిపిస్తే మలబద్ధకం సహా, ఇతర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలకు జలుబు, దగ్గు వంటి సమస్యలు తరచుగా వస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ప్రీ-మెచ్యూర్‌గా ఉన్న బిడ్డ తరచుగా వ్యాధులను ఎదుర్కోవలసి వస్తుంది. 6 నెలల తర్వాత కూడా, పిల్లలు ప్రీ-మెచ్యూర్ కావడం వల్ల తరచుగా వ్యాధులకు గురవుతారు. ఆ సమయంలో వైద్యుని సలహా మేరకు వారికి కివి తినిపించొచ్చు. కివీలో ఉండే పదార్థాలు పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
ఐరన్ లోపాన్ని తొలగిస్తుంది.. ఐరన్ లోపం ఉన్న పిల్లలకు కివీ వంటి పండ్లను తప్పనిసరిగా తినిపించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కివిలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీన్ని మీ బిడ్డకు క్రమం తప్పకుండా తినిపిస్తే ఐరన్ సమస్య తీరుతుంది. అయితే, కొన్ని పరిస్థితులలో పిల్లలకు కివి తినిపించడాన్ని నివారించాలి. నిపుణుల సలహాలు తీసుకున్న తరువాతే కివి వారికి తినిపించాలి. ముఖ్యంగా పిల్లలకు ఉదర సమస్యలు, దద్దుర్లు ఉంటే కివిని తినిపంచకూడదని నిపుణులు చెబుతున్నారు.
Also read:
Astro ideas: ఈ పనులు అస్సలు చేయకూడదు.. లేదంటే లక్ష్మీదేవి అగ్రహానికి గురై ఆర్థికంగా చితికిపోతారు..!