Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌ వారికి కూడా వస్తుంది.. తస్మాత్‌ జాగ్రత్త.. కీలక విషయాన్ని వెల్లడించిన వైద్య నిపుణులు

Black Fungus: ఒక వైపు కరోనా మహమ్మారి మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌ (మ్యూకోర్‌మైకోసిన్‌ ఇన్ఫెక్షన్‌).. ఇలా జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక వైపు కరోనా కట్టడికి లాక్‌డౌన్‌,..

Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌ వారికి కూడా వస్తుంది.. తస్మాత్‌ జాగ్రత్త.. కీలక విషయాన్ని వెల్లడించిన వైద్య నిపుణులు
Black Fungus
Follow us
Subhash Goud

|

Updated on: May 25, 2021 | 2:59 PM

Black Fungus: ఒక వైపు కరోనా మహమ్మారి మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌ (మ్యూకోర్‌మైకోసిన్‌ ఇన్ఫెక్షన్‌).. ఇలా జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక వైపు కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే కొత్తగా వచ్చి చేరిన బ్లాక్‌ ఫంగస్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఆ బ్లాక్‌ ఫంగస్‌ అనేది కేంద్ర ఆరోగ్యశాఖకు పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 9 వేల వరకు కేసులు నమోదైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.  కేంద్రం చెబుతోంది.  ఈ బ్లాక్‌ ఫంగస్‌ వల్ల మెదడులో ఇన్ఫెక్షన్‌, ఊపిరితిత్తులకు ప్రమాదం పొంచివుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు బ్లాక్‌ ఫంగస్‌ కరోనా వైరస్‌ సోకిన వారికే వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. అయితే తాజాగా మరో కీలక విషయాన్ని గుర్తించారు వైద్య నిపుణులు.

కోవిడ్‌ సోకని వారికి కూడా ఈ బ్లాక్‌ ఫంగస్‌ సోకుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికంగా మధుమేహం ఉన్నవారికి సోకే ప్రమాదం ఉందని నీతి అయోగ్‌ సభ్యుడు వీకే.పాల్‌ తెలిపారు. డయాబెటిస్‌ నియంత్రణ లేని వారికి సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ 700పైగా చేరుకున్నప్పుడు బ్లాక్‌ ఫంగస్‌కు గురవుతారని డయాబెటిస్‌ నిపుణులు పేర్కొంటున్నారు.. అంతేకాదు బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి నిమోనియా, ఇతర వ్యాధులు కూడా దరి చేరే అవకాశాలున్నాయంటున్నారు. అయితే ఈ బ్లాక్‌ ఫంగస్‌ గురించి ఆరోగ్యంగా ఉన్న వారు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Children Covid-19: పిల్లల్లో కరోనా లక్షణాలను ఎలా గుర్తించాలి..? తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలివే..!

Amla Health Benefits: ఉసిరికాయతో ఎన్నో ప్రయోజనాలు.. ఉదయాన్నే ఉసిరి తింటే ఆ సమస్యలు పరార్‌..!

Steam Inhalation: కరోనా కోసం అతిగా ఆవిరి పడితే ప్రమాదమే.. ముక్కు దిబ్బడ కోసమే పట్టాలి..!