CHINA MYSTERY CAVE: కరోనా మూలాలు గబ్బిలాల్లో..! చైనా గుహలపై వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూలాలు చైనాలోని ఓ గుహలో వున్నాయంటోంది అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ అనే పత్రిక. ఈ మేరకు అమెరికా ఇంటలిజెన్స్ నివేదిక ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్

CHINA MYSTERY CAVE: కరోనా మూలాలు గబ్బిలాల్లో..! చైనా గుహలపై వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
China.
Follow us
Rajesh Sharma

|

Updated on: May 25, 2021 | 2:57 PM

CHINA MYSTERY CAVE CORONA BIRTH PLACE: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూలాలు చైనాలోని ఓ గుహలో వున్నాయంటోంది అమెరికా(AMERICA)కు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ (WALL STREET JOURNAL) అనే పత్రిక. ఈ మేరకు అమెరికా ఇంటలిజెన్స్ (AMERICAN INTELLEGENCE) నివేదిక ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. కరోనా మూలాలు చైనాలోని ఓ గుహలో వున్నాయని, ఆ గుహలోకి 2012లో గబ్బిలాల (BATS) విసర్జితాలను తొలగించేందుకు వెళ్ళిన ఆరుగురు చైనీయుల్లో.. ముగ్గురికి వైరస్ సోకిందని కథనంలో పేర్కొన్నారు. ఆ ముగ్గురు కొన్ని రోజులకే మరణించగా.. వారికి సోకిన వైరస్‌ను గుర్తించే బాధ్యతలను వూహన్‌ (WUHAN)లోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలకు అప్పగించారు. వారు పరిశోధనలు జరుపుతున్న క్రమంలోనే వైరస్ లీక్ అవడం.. గత ఏడాదిన్నరగా ప్రపంచాన్ని గడగడలాడించడం జరుగుతుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

ఈ రహస్య గుహకు సంబంధించిన వివరాలను 2017లో చైనాలోని షాంఘై సిటీ (SHANGHAI CITY) నుంచి ప్రచురితమయ్యే నేచర్ అనే పత్రిక వెల్లడించింది. భవిష్యత్తులో ప్రబలే అంటువ్యాధులకు ఈ గుహలోని గబ్బిలాలు, వాటి విసర్జితాలు కారణం కావచ్చని నేచర్ కథనంలో హెచ్చరించారు. 2002లో 800 మరణాలతో గ్లోబల్ ఎమర్జెన్సీ (GLOBAL EMERGENCY)కి కారణమైన సార్స్ (SARS) వంటి వైరస్ మూలాలు కూడా చైనాలోని యునాన్ ప్రావిన్స్ ప్రాంతంలోని గుహల్లోనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తాజాగా కరోనా వైరస్‌ (CORONA VIRUS)కు సంబంధించిన మూలాలను కూడా గుహల్లోనే కనుగొంటున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ పుట్టుకకు కారణం గబ్బిలాలే అన్న నిర్ధారణకు శాస్త్రవేత్తలు వస్తున్నట్లు తెలుస్తోంది. 2002లో చైనాలోని గ్వాంగ్‌దాంగ్ ఏరియాలో మొదలైన సార్స్ వైరస్ 2003లో చాలా దేశాలకు విస్తరించింది. దీనికి కారణమైన కరోనా వైరస్ స్ట్రెయిన్‌ను జంతు మార్కెట్‌లో విక్రయించే సివిట్ అనే జీవిలో ముందుగా గుర్తించారు. ఆ తర్వాత హార్స్‌హు గబ్బిలాలు సార్స్ వైరస్ మూలాలుగా కనుగొన్నారు. వూహన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన షి జంగ్ లీ, క్యూ జీ అనే శాస్త్రవేత్తల సారథ్యంలోని సైంటిస్టుల టీమ్.. చైనాలోని వేలాది గబ్బిలాల నుంచి నమూనాలను సేకరించి, పరిశోధనలు జరిపింది.

ఇదే క్రమంలో 2012 ఏప్రిల్ నెలలో యునాన్ ఏరియాలోని గుహల్లో గబ్బిలాల విసర్జితాలను తొలగిస్తూ వైరస్ బారిన పడ్డారు. వీరిలో సార్స్ లక్షణాలు కనిపించాయి. వీరిలో ముగ్గురు కొన్ని రోజులకే మరణించారు. బతికిన వారిని కూడా పరిశీలించగా.. వారిలో సార్స్‌కు ద్వారా శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీస్ వున్నాయి. దాంతో వారికి కూడా వైరస్ సోకిందని గుర్తించారు. అదే క్రమంలో ఆ గుహల్లోని గబ్బిలాలపై అయిదేళ్ళ పాటు అంటే 2017 దాకా పరిశోధనలు కొనసాగించారు. గబ్బిలాల మలం నమూనాలు, మలద్వార స్వాబ్ నమూనాలను సేకరించి వూహన్ లాబ్‌లో పరిశోధనలు కొనసాగించారు.

సార్స్ కోవ్ 2 వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించిన నేపథ్యంలో చైనా అప్రమత్తమైంది. ఈ గుహలున్న ప్రాంతానికి ఎవరు వెళ్ళకుండా కట్టడి చేయడం మొదలుపెట్టింది. అక్కడికి వెళ్ళేందుకు ప్రయత్నించిన అసోసియేటెడ్ ప్రెస్ జర్నలిస్టులను చైనా సెక్యురిటీ దళాలు వెంటాడి మరీ అదుపులోకి తీసుకున్నాయి. బీబీసీ బృందం చేసిన ప్రయత్నాలను కూడా సెక్యురిటీ సిబ్బంది అడ్డుకుంది. ఈ గుహకు సంబంధించిన పరిశోధనా పత్రాలను ప్రస్తుతం చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుపుతున్న టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించాల్సి వుంది.