Tokyo: జపాన్ దేశానికి వెళ్లవద్దని అమెరికన్లకు ప్రభుత్వ హెచ్చరిక , అత్యున్నత స్థాయి అడ్వైజరీ జారీ, ఎందుకంటే ?
జపాన్ దేశానికి వెళ్లరాదని తమ దేశస్థులను అమెరికా హెచ్చరిస్తోంది.జపాన్ లో కోవిద్-19 కేసులు పెరిగిన కారణంగా టోక్యో ప్రయాణాలను మానుకోవాలని సూచించింది.
జపాన్ దేశానికి వెళ్లరాదని తమ దేశస్థులను అమెరికా హెచ్చరిస్తోంది.జపాన్ లో కోవిద్-19 కేసులు పెరిగిన కారణంగా టోక్యో ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ‘.’.లెవెల్ 4…డు నాట్ ట్రావెల్’ అనే అడ్వైజరీ’ని జారీ చేసింది. ఇది అత్యున్నత స్థాయి వార్నింగ్ ! ఆ మధ్య ఇండియాకు వెళ్లరాదని కూడా ఇలాగే అమెరికా కోరిన విషయం గమనార్హం. అయినా ఆ జపాన్ కు అమెరికన్లు కూడా ఏడాది కాలంగా తమ ప్రయాణాలను మానుకున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే వెళ్లి వస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా 2020 లో జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ ని జపాన్ ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో ఈ సారి జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు వీటిని నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ దేశంలో గత మార్చి నెలలో హెల్త్ ఎమర్జెన్సీని ఎత్తివేయడంతో అప్పటి నుంచి కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. పైగా మెడికల్ ప్రొఫ్షనల్స్ గానీ, సిరంజీలు తదితర వైద్య సామగ్రి గానీ తగినంతగా లేని కారణంగా ఇక్కడ వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. ప్రజల్లో కనీసం 2 శాతం మంది మాత్రమే మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఒసాకా, టోక్యో నగరాల్లో త్వరలో పెద్దఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. మోడెర్నా, ఆస్ట్రాజెనికా టీకామందులను ఇవ్వాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం ఈ నెల 21 న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక కోవిద్ కేసులు పెరుగుతున్న కారణంగా మళ్ళీ టోక్యో ఒలంపిక్స్ ని వాయిదా వేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. 6 వేలమంది డాక్టర్లతో కూడిన టోక్యో మెడికల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఈ పోటీలను రద్దు చేయాలనీ కోరగా ఇందుకు సంబంధించిన పిటిషన్ పై మూడున్నర లక్షల మంది ప్రజలు సంతకాలు చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Akilesh: పరీక్షలు నిర్వహించాలంటే ముందు ఆ పని చేయాల్సిందే.. తెరపైకి కొత్త డిమాండ్ తీసుకొచ్చిన అఖిలేష్ యాదవ్..