Brain Stroke: యువతలో పెరుగుతున్న బ్రెయిన్‌స్ట్రోక్.. కారణం ఇదే అంటున్న తాజా పరిశోధనలు!
నేటి కాలంలో గుండెపోటు మాదిరిగానే బ్రెయిన్ స్ట్రోక్‌లు కూడా పెరుగుతున్నాయి. గతంలో వృద్ధులు ఈ వ్యాధి బారిన పడేవారు. కానీ నేటి జీవన శైలి కారణంగా యువత కూడా దీని బారిన పడుతున్నారు. గత రెండు దశాబ్దాలలో యువతలో బ్రెయిన్ స్ట్రోక్ సంభవం సుమారు 15 శాతం పెరిగింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ జరిపిన అధ్యయనంలో ఈ సమాచారం బయటపడింది. బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు..

నేటి కాలంలో గుండెపోటు మాదిరిగానే బ్రెయిన్ స్ట్రోక్‌లు కూడా పెరుగుతున్నాయి. గతంలో వృద్ధులు ఈ వ్యాధి బారిన పడేవారు. కానీ నేటి జీవన శైలి కారణంగా యువత కూడా దీని బారిన పడుతున్నారు. గత రెండు దశాబ్దాలలో యువతలో బ్రెయిన్ స్ట్రోక్ సంభవం సుమారు 15 శాతం పెరిగింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ జరిపిన అధ్యయనంలో ఈ సమాచారం బయటపడింది. బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు వారిలో మరింత పెరుగుతోందని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ రేటు 2010 నుంచి గణనీయంగా పెరుగుతోంది. CDC నివేదిక ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలలో ప్రజల జీవనశైలిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే ఆహారపు అలవాట్లు కూడా మారుతూ వచ్చాయి. CDC ప్రకారం పురుషుల కంటే స్త్రీలలో స్ట్రోక్ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం పురుషులలో 7 శాతం ఉంటే, స్త్రీలలో 10 శాతం వరకు ఉన్నట్లు సీడీసీ అధ్యయనాల్లో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గత ప్రధాన కారణాలలో బ్రెయిన్ స్ట్రోక్ ఐదవ స్థానంలో ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా సందర్భాలలో రోగికి దీని లక్షణాలు తెలియక పోవడంతో వైద్యం ఆలస్యంగా అందడంతో మరణాలు పెరుగుతున్నాయి.
బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది?
బ్రెయిన్ స్ట్రోక్‌కు అనేక కారణాలు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో మెదడులో రక్తం గడ్డకట్టడం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ప్రధాన కారణాలు. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. దీని వల్ల స్ట్రోక్ వస్తుంది. అదేవిధంగా బీపీ పెరగడం వల్ల కూడా మెదడులో ఉండే సిరలపై ఒత్తిడి ఎక్కువై లోపల రక్తస్రావం అవుతుంది. దీనివల్ల పక్షవాతం వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువగా ధూమపానం చేసేవారు, అతిగా మద్యం సేవించే వారు, అనారోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉన్నవారు, ఊబకాయం ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అది 18 సంవత్సరాల వయస్సు వారైనా 40 ఏళ్ల వారైనా ఎవరైనా కావచ్చు. కాబట్టి పొగతాగడం, మద్యం సేవించడం వంటివి మానుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
స్ట్రోక్ ప్రారంభ లక్షణాలు ఇవే..
- మసక దృష్టి
- మైకం
- మాట్లాడటం కష్టం
ఎలా నివారించాలి?
- కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోంఇతొ
- రోజువారీ వ్యాయామం
- బరువును అదుపులో ఉంచుకోవడం
- తలనొప్పి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.




