AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sesame Seeds: తెలుపు వర్సెస్ నల్ల నువ్వులు! రెండింటిలో పోషక విలువలు ఎందులో ఎక్కువంటే?

చలికాలం వచ్చిందంటే మన శరీరానికి లోపల నుంచి వెచ్చదనం బలం అవసరం. ఆయుర్వేదంలో పోషకాహారంలో ఈ చలిని తట్టుకోవడానికి నువ్వులకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే కిరాణా దుకాణానికి వెళ్లినప్పుడు నల్ల నువ్వులు తెలుపు నువ్వుల్లో ఏది కొనాలి? ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, చలికాలంలో ఎముకల బలానికి, రోగనిరోధక శక్తికి ఈ రెండింటిలో ఏది ఉత్తమమైన సూపర్ ఫుడ్? పోషక నిపుణులు సూచించే ఆ డార్క్ సీక్రెట్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Sesame Seeds: తెలుపు వర్సెస్ నల్ల నువ్వులు! రెండింటిలో పోషక విలువలు ఎందులో ఎక్కువంటే?
Black Sesame Benefits Winter
Bhavani
|

Updated on: Nov 11, 2025 | 2:18 PM

Share

నువ్వులు సహజంగా శరీరానికి వేడిని ఇచ్చే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే చలికాలంలో వీటిని తీసుకోవడం వలన శరీరం వెచ్చగా ఉండి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే నలుపు తెలుపు రంగుల్లో లభించే ఈ నువ్వుల గింజల్లో, పోషక విలువలు దృష్ట్యా, చలికాలంలో తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులే మరింత ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నల్ల నువ్వులే ఎందుకు ఉత్తమం?

నలుపు, తెలుపు నువ్వుల మధ్య ప్రధాన వ్యత్యాసం వాటిపై ఉండే తొక్క (పొట్టు) లో ఉంటుంది. తెల్ల నువ్వులు పొట్టు తీయబడి ఉంటాయి. నల్ల నువ్వులకు పొట్టు అలాగే ఉంటుంది. ఈ పొట్టు ఉండటం వలన నల్ల నువ్వుల్లో కాల్షియం దాదాపు 60 శాతం అధికంగా ఉంటుంది. చలికాలంలో ఎముకల కీళ్ల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి, కీళ్ల నొప్పులు తగ్గించడానికి ఈ కాల్షియం చాలా అవసరం.

అంతేకాక, పొట్టు కారణంగా నల్ల నువ్వుల్లో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు జలుబు వంటి వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. నల్ల నువ్వుల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ కాపర్ వంటి పోషకాలు నరాల బలహీనతను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఇవి కొలెస్ట్రాల్ రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి కూడా తోడ్పడతాయి.

చలికాలంలో మీరు నువ్వుల ద్వారా గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలు, శరీరానికి కావాల్సినంత వేడి పొందాలనుకుంటే, నల్ల నువ్వులను నేరుగా లేదా లడ్డూలు చిక్కీలు రూపంలో తీసుకోవడం ఉత్తమం. అయితే, నువ్వులు వేడి చేస్తాయి కాబట్టి, వాటిని తీసుకునే రోజుల్లో నీరు కూడా బాగా తాగడం చాలా ముఖ్యం.

గమనిక: ఈ సమాచారం ఆహార పోషక విలువలు, సాంప్రదాయ ఆరోగ్య సూచనల ఆధారంగా ఇవ్వబడింది. ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహార మార్పులకు ముందు వైద్య నిపుణుడిని సంప్రదించాలి.