Pets: పెంపుడు జంతువులతో తస్మాత్ జాగ్రత్త..!.. అతి చనువుతో 190 రకాల వ్యాధులకు అవకాశం..!!
రోజురోజుకూ పెంపుడు జంతువులు పెంచుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కుక్కలు, పిల్లులను, కుందేళ్లను, చిలుకలును పెంచుకోవడానికి ఇష్టపడతున్నారు. వాటితో ఆడుకోవడం, ఫొటోలు దిగడం. సరదాగా బయటకు తీసుకెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాటిని ముద్దాడుతూ సంబరపడిపోతుంటారు. అయితే పెట్స్ పెంచుకునే వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. వాటిన వల్ల మనకు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు ఆ వ్యాదులు ఏంటో తెలుసుకుందాం పదండి.

పేద దనిక, తేడా లేకుండా తమకు తినడానికి ఉన్న లేకున్నా.. పెంపుడు జంతువులను పెంచుకొని వాటిని ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటారు చాలా మంది. అయితే ఇళ్లలో జంతువులను పెంచుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి ద్వారా మనకు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని అంటున్నారు. వాటి ఏ విదంగా పెంచాలో తెలుసుకొని వాటిని వ్యాధులు సోకకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. అందుకోసం పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా జూలై 6న నిర్వహించే ప్రపంచ జునోసిస్ డే కార్యక్రమానికి వెళ్లమని సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా అవగాహన కల్పిస్తారు.
జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ పాశ్చర్ అనే సైంటిస్ట్ అనేక పరిశోధనలు చేసి రేబిస్ వ్యాధి నివారణకు టీకాను కనుగొన్నాడు. 1885వ సంవత్సరం జులై 6న ఫ్రాన్స్‌లో పిచ్చికుక్క కాటుకు గురైన ఓ బాలుడికి ఈ టీకాను ఇవ్వడం ద్వారా అతని ప్రాణాలు కాపాడారు. అప్పటి నుంచి ఏటా జులై 6న జూనోసిస్ డే నిర్వహిస్తూ వస్తున్నారు.
పెంపుడు జంతువుల ద్వారా మానవులకు సంక్రమించే వ్యాధులు
ఇందులో భాగంగానే శనివారం జూనోసిస్ డే సందర్భంగా విజయవాడలో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు పసువర్ధక శాఖ అధికారులు. అయితే శాస్త్రవేత్తలు, వైద్యుల అంచనాల ప్రకారం జంతువుల నుంచి మనుషులకు దాదాపుగా 190 రకాల వ్యాధులు సోకతాయని తెలిపారు. ఇప్పటి వరకు మానవులకు సంక్రమించే వ్యాధుల్లో 75 శాతం అంటువ్యాధులు కాగా, వాటిలో 60 శాతం జంతువుల నుంచి సంక్రమిస్తున్నవేనాని వివరించారు. పశువుల ద్వారా మశూచి, గాలికుంటు, రేబిస్, ఆంత్రాక్స్, లిస్టీరియోసిస్, బ్రూసెల్లోసిస్, క్యూ ఫీవర్, క్షయ, తామర, బెబీసియోసిస్, ఫైలేరియాసిస్, హైడాటిడోసిస్, ట్రిపనసోమియాసిస్, వ్యాపిస్తాయి. టాక్సోప్లాస్మోసిస్ వ్యాధులు గొర్రెలు, మేకలు ద్వారా రేబిస్, ఆంత్రాక్స్, లిస్టీరియోసిస్ , బ్రూసెల్లోసిస్, క్యూ ఫీవర్, సాల్మొ నెల్లోసిస్, హైడాటిడోసిస్, ట్రిపనసోమియాసిస్, వ్యాపిస్తాయి. టాక్సోప్లాస్మోసిస్ వ్యాధులు సక్రమిస్తాయని తెలిపారు. ప్రమాదవశాత్తు పెంపుడు జంతువులు కాటు వేసినా, గోర్లతో రక్కినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదిని అంటున్నారు.
పెంపుడు జంతువులను ఎంత వరకు ప్రేమించాలో అంతలోనే ఉంచాలని.. వాటికి అతిగా గారాబం చేసి ప్రాణాల పైకి తెచ్చుకోవద్దని పసువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ హనుమంతరావు అన్నారు. పెంపుడు జంతువుల వైద్యానికి వచ్చేవారిలో 90 శాతం మంది కుక్కలు పెంచుకునే వారే ఉంటున్నారని, వాటిని తాము నివసించే పడక గదులలో పడుకోబెట్టుకోవటం, వంట గదులలో పాత్రలతో ఆడుకోవటం, పిల్లలు తమ ఒల్లో పెట్టుకొని ఆడుకోవటం తగ్గించాలని తెలిపారు. పిల్లలు వాటితో ఆడుకున్న తర్వాత వారి చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలని సూచించారు. లేకుంటే వ్యాధుల సంక్రమించే ప్రమాదం ఉందని తెలిపారు.
ముఖ్యంగా కుక్కలకు సరైన వయసులో టీకాలు వేయించుకోవాలని, పుట్టిన 45 వ రోజు, 60వ రోజు, 90వ రోజు, అక్కడి నుంచి ప్రతీ 6 నెలలకు, 12 నెలలకు రాబీస్, ఇతర వ్యాధులను నివారించే టీకాలను వేసుకోవాలి తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.