Eyes Health: కళ్లలో నొప్పి, అలసటతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం..

కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు ఉపయోగించడం వల్ల కళ్లలో నొప్పి సమస్య కూడా వస్తుంది. వీటిని విస్మరిస్తే ప్రమాదం మరింత పెరుగుతుంది.

Eyes Health: కళ్లలో నొప్పి, అలసటతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం..
Eyes Health
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 31, 2022 | 6:54 AM

Eyes Health Tips: ప్రస్తుత కాలంలో చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కంప్యూటర్‌పై నిరంతరం పని చేయడం వల్ల కళ్లు బాగా అలసిపోతాయి. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు ఉపయోగించడం వల్ల కళ్లలో నొప్పి సమస్య కూడా వస్తుంది. వీటిని విస్మరిస్తే ప్రమాదం మరింత పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో కంటి అలసటను ఎలా తొలగించాలో చాలామందికి అర్థంకాదు. మీరు కూడా కళ్ళు అలసిపోయినట్లు అనిపిస్తే ఈ పరిస్థితిలో కొన్ని ప్రభావవంతమైన నివారణ చిట్కాలను ప్రయత్నించవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

బంగాళదుంపలు ఉపయోగించండి

మీ కళ్లు అలసిపోయినట్లు అనిపిస్తే పచ్చి బంగాళదుంపలను ఉపయోగించవచ్చు. ఇది కళ్ల చికాకు, అలసటను తగ్గిస్తుంది. దీన్ని ఉపయోగించడానికి బంగాళాదుంపను సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మీ కళ్లపై కాసేపు ఉంచండి. దీంతో కంటి అలసట తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

కీర దోసకాయ ఉపయోగం

కంటి అలసట, బలహీనతను తొలగించడానికి కీర దోసకాయను కూడా ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడానికి, రెండు దోసకాయ ముక్కలను తీసుకోండి. మీ కళ్లపై ఉంచండి. కొంత సమయంపాటు విశ్రాంతి తీసుకోండి. దీంతో కంటి అలసట తగ్గుతుంది.

పాలతో ప్రయోజనం..

కంటి అలసటను తొలగించడానికి చల్లని పాలను ఉపయోగించండి. ఇది కళ్లలో ఉండే ఇన్ఫెక్షన్, అలసటను తొలగిస్తుంది. దీన్ని ఉపయోగించడానికి పాలను పత్తిలో ముంచండి. ఇప్పుడు దాన్ని పాచ్ చేసి కళ్లపై పెట్టుకోవాలి. ఇది మీ అలసటను తగ్గిస్తుంది.

అలోవెరా జెల్

అలోవెరా జెల్ కంటి అలసటను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని ఉపయోగించడానికి, అలోవెరా జెల్‌ను కళ్లపై కొంత సమయం పాటు ఉంచండి. అది అలసటను దూరం చేసి ఉపశమనం కలిగిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం