AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడి పండ్లు నిగనిగలాడుతున్నాయని కొంటున్నారా..? ఈ పండ్లను కొనేముందు జాగ్రత్త..!

వేసవి రాగానే అందరికీ మామిడి పండ్ల మజా మొదలవుతుంది. కానీ మార్కెట్‌లో ఎక్కువగా రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లే లభిస్తున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. సహజంగా పండిన పండ్లను ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. కృత్రిమంగా మగ్గబెట్టిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసుకోవాలంటే ఈ చిట్కాలు మీ కోసం.

మామిడి పండ్లు నిగనిగలాడుతున్నాయని కొంటున్నారా..? ఈ పండ్లను కొనేముందు జాగ్రత్త..!
Healthy Mangoes
Prashanthi V
|

Updated on: Mar 15, 2025 | 9:18 AM

Share

వేసవి రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇవి ఎంతో ఇష్టంగా తింటారు. కానీ మనం తినే మామిడి పండ్లు సహజంగా పండాయా..? లేక రసాయనాలతో మగ్గబెట్టినవా..? అనే విషయం చాలా ముఖ్యమైనది. మార్కెట్లో ఎక్కువగా మగ్గబెట్టిన పండ్లే కనిపిస్తున్నాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. కాబట్టి సహజంగా పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం అవసరం. అందుకు కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సహజంగా పండిన మామిడి పండ్లు కొద్దిగా గట్టిగా ఉంటాయి. కొద్దిగా ఒత్తితే అవి మెల్లగా ఒడిగొస్తాయి. కానీ రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లు ఎక్కువగా మెత్తగా ఉంటాయి. కాస్త బిగించి చూసినప్పుడు అవి అతి త్వరగా తొడిమపోతాయి. ఇది రసాయనాలతో చేసిన ప్రభావమే.

సహజంగా పండిన మామిడి పండ్లపై చిన్న చిన్న గీతలు, కొద్దిగా మచ్చలు ఉండొచ్చు. కానీ అవి ప్రమాదకరం కావు. కానీ రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లపై ఆకస్మికంగా మచ్చలు ఏర్పడటాన్ని గమనించవచ్చు. ఇవి అసహజంగా కనిపిస్తాయి.

సహజంగా పండిన మామిడి పండ్లు వేరువేరు రంగుల్లో కనిపిస్తాయి. కొన్ని చోట్ల పసుపు, కొన్ని చోట్ల ముదురు నారింజ రంగులో ఉంటాయి. కానీ రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లు పూర్తిగా ఒకే రంగులో మెరిసిపోతాయి. అవి అసహజంగా ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కాబట్టి మీరు కొనేటప్పుడు ఈ తేడాను గమనించండి.

వాటంతటఅవే పండిన మామిడి పండ్లకు సహజమైన తియ్యటి వాసన వస్తుంది. కానీ రసాయనాలతో మగ్గబెట్టిన మామిడి పండ్లకు కాస్త అసహజమైన వాసన ఉండవచ్చు లేదా అవి వాసన లేకుండా ఉంటాయి. కాబట్టి మీరు మామిడి పండ్లు కొనేటప్పుడు వాటి వాసనను గమనించడం మంచిది.

మామిడి పండు సహజంగా పండిందా..? లేదా రసాయనాలతో మగ్గబెట్టిందా..? అనే విషయం తెలుసుకోవడానికి ఇది చాలా సరళమైన పద్ధతి. ఓ గిన్నెలో నీటిని నింపి అందులో మామిడి పండ్లను వేయండి. సహజంగా పండిన పండ్లు నీటిలో మునుగుతాయి, కృత్రిమంగా మగ్గబెట్టిన పండ్లు నీటిపై తేలిపోతాయి. ఇది అతి తేలికగా ప్రయత్నించదగిన పద్ధతి.

మరో టెస్టింగ్ పద్ధతి కూడా ఉంది. ఒక గిన్నెలో నీటిని నింపి అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసి మామిడి పండ్లను అందులో నిమిషం పాటు ఉంచండి. ఆ తర్వాత మామిడి పండ్లను కడిగి చూడండి. అవి అసహజంగా రంగు మారితే అది రసాయనాలతో పండించిన మామిడి పండు అని అర్థం.

ఇప్పటి నుంచి మామిడి పండ్లు కొనేటప్పుడు పై సూచనలను పాటించండి. సహజంగా పండిన మామిడి పండ్లను మాత్రమే తినండి. కృత్రిమంగా మగ్గబెట్టిన మామిడి పండ్లు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు, పొట్ట ఉబ్బరం, అసహజమైన కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. అందుకే మామిడి పండ్లు తినేటప్పుడు ఆరోగ్యకరమైనవి ఎంచుకోవడం చాలా ముఖ్యం.