పుచ్చకాయతో వీటిని కలిపి పొరపాటున కూడా తినకండి..! అశ్రద్దతో తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
వేసవి వచ్చిందంటే ఎక్కువగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. దీనిలో ఎక్కువ శాతం నీరు ఉండటంతో వేడిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. పుచ్చకాయలో విటమిన్ A, B కాంప్లెక్స్, C, పొటాషియం లాంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి, శరీరానికి చాలా మేలు చేస్తాయి. అలాగే ఇందులో లైకోపీన్, బీటా-కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో ఇమ్యూనిటీ బలపడేందుకు సహాయపడతాయి.

పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదే కానీ దాన్ని కొన్ని ఆహారాలతో కలిపి తింటే జీర్ణక్రియ సమస్యలు, కడుపు ఉబ్బరం, అజీర్ణం లాంటి ఇబ్బందులు రావచ్చు. అలాగే పుచ్చకాయ తిన్న వెంటనే కొన్ని ఆహారాలను తినడం వల్ల శరీరంపై దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ తిన్న తర్వాత పాలను తాగితే అజీర్ణ సమస్యలు వస్తాయి. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అసహజమైన కడుపు నొప్పి కలిగే అవకాశం ఉంటుంది. పుచ్చకాయలో విటమిన్ C ఎక్కువగా ఉండటంతో అది పాలలోని ప్రొటీన్లతో కలిసి శరీరంలో అసమతుల్యతను సృష్టించవచ్చు.
పుచ్చకాయ తిన్న వెంటనే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల జీర్ణక్రియ మందగించి కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మాంసం, చేపలు వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను పుచ్చకాయతో కలిపి తినొద్దు.
గుడ్డు, పుచ్చకాయ కలిపి తినకూడదు. గుడ్లలో ఒమేగా-3, ప్రోటీన్లు ఉంటాయి. అయితే పుచ్చకాయలో ఎక్కువ నీరు ఉండటం వల్ల ఈ రెండు కలిసి శరీరంలో అసమతుల్యతను కలిగించవచ్చు. దీని వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు.
ఉప్పు కలిపి తినకూడదు. కొంతమంది పుచ్చకాయ రుచిని మెరుగుపరిచేందుకు దానికి ఉప్పు చల్లుతారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఉప్పు కలిపితే పుచ్చకాయలోని పోషకాలు శరీరానికి సరిగ్గా గ్రహించబడవు. అలాగే అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది హానికరం.
పుచ్చకాయ తినే సమయం కూడా చాలా ముఖ్యమైనది. రాత్రిపూట తింటే జీర్ణక్రియ మందగించి కడుపులో సమస్యలు తలెత్తవచ్చు. దీనివల్ల తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సిన అవసరం రావడం, నిద్ర భంగం అవ్వడం జరుగుతుంది. అందువల్ల ఉదయం లేదా మధ్యాహ్నం పుచ్చకాయ తినడం ఉత్తమం.
చాలా మంది పుచ్చకాయను కట్ చేసి కొంత తిని మిగిలిన భాగాన్ని ఫ్రిజ్‌లో పెడతారు. అయితే ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయ పోషకాలను కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇది తినడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు.
పుచ్చకాయ మంచి పోషకాలతో నిండిన పండు. అయితే దాన్ని సరైన సమయంలో, సరైన విధంగా తీసుకోవాలి. పై చెప్పిన ఆహారాలతో కలిపి తినకూడదు. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లను పాటించడం అవసరం.